twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్: మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ (ఫొటోలుతో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: మెగాస్టార్ చెయ్యి వేస్తే ఆ తీరే వేరు....ఆ పబ్లిసిటీనే అదురుతుంది. అందుకునే రుద్రమదేవి టీమ్ ఆయన్ను రంగంలోకి దించింది. చిరంజీవికు, గుణశేఖర్ కు ఉన్న పరిచయంతో ఆయన ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. దాంతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రానా, అల్లు అర్జున్‌లు కీలక పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో చిత్రం యూనిట్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

    ఈ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పారంటూ అందుకు సంబంధించిన ఫొటోను 'రుద్రమదేవి' చిత్ర అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. 'చారిత్రక వైభవమైన కథకు అసమానమైన మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌' అంటూ అందులో పేర్కొంది.

    స్లైడ్ షోలో ఫొటోలు

    ముందే...

    ముందే...

    చిరంజీవి 150 చిత్రానికి ముందే ఆయన అభిమానులు 'చిరు 'గళాన్ని రుద్రమదేవిలో విని ఆనందించనున్నారు.

    ఫేస్ బుక్ ద్వారా

    ఫేస్ బుక్ ద్వారా

    ఈ రోజు రాత్రి 7గంటలకు మీరొక ఆసక్తికరమైన విషయాన్ని వింటారు అంటూ 'రుద్రమదేవి' చిత్ర బృందం ఉదయమే ఓ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టడం విశేషం.

    మెగాభిమానుల ఆనందం

    మెగాభిమానుల ఆనందం

    దాంతో ఇప్పుడు మెగాబిమానులు కన్ను సైతం ఈ చిత్రంపై పడింది. వారితో ఓపినింగ్స్ బాగుంటాయని టీమ్ భావిస్తోంది.

    వక్రికరించకుండా

    వక్రికరించకుండా

    రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు గుణశేఖర్.

    సాంకేతిక అద్భుతం

    సాంకేతిక అద్భుతం

    సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది .

    రుద్రమ గురించి కొత్త సంగతులు

    రుద్రమ గురించి కొత్త సంగతులు

    రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

    అపరకాళీ అవతారం

    అపరకాళీ అవతారం

    అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.

    అంతర్జాతీయ ప్రమాణాలు

    అంతర్జాతీయ ప్రమాణాలు

    భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

    గర్వించేలా...

    గర్వించేలా...

    తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

    ఎవరెవరు

    ఎవరెవరు

    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్ కనిపిస్తారు.

    అలాగే ఇంకా...

    అలాగే ఇంకా...

    ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

    తెర వెనక,ముందు

    తెర వెనక,ముందు

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Chiranjeevi will be narrating the story of Rudrama as Gunasekhar managed the mighty mega hero successfully on board to give voice over. Already Chiranjeevi dubbed his track, and Gunasekhar is unable to come out of euphoric experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X