twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి 150వ సినిమాకు పవన్ కళ్యాణ్‌కు లింకేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు, కథ ఓకే కావడమే ఆలస్యం...రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా సీన్లోకి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ బర్త్ డే కావడంతో.. అదే రోజున 150వ మూవీని ప్రారంభించాలనుకుంటున్నారట. ఎందకు అలా? అంటే...మెగా బ్రదర్స్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికే..అంటూ ప్రాచరం జరుగుతోంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ రానుంది.

    చిరంజీవి 150వ సినిమా గురించిన ఇతర వివరాల్లోకి వెళితే.. తర్జన బర్జనల అనంతరం పూరి జగన్నాథ్ అయితేనే బెటరని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలకు థియేటర్లు డెకరేషన్ చేసిన పూరి జగన్నాథ్....ఆయన్నే దర్శకత్వం వహించే అవకాశం దక్కడంపై ఆనందంగా ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆయన శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.

    ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్న సంగతి తెలిసింతే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్. ఒక వేళ ఆమె డేట్స్ దొరకకపోతే హిందీ బ్యూటీ సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట పూరి. అంజలిని సెంకడ్ హీరోయిన్ గా, చార్మిని ఐటం గర్ల్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని త్వరలో అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి.

     Chiru's 150th to start rolling from Pawan Kalyan's Birthday

    స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం..
    చిరంజీవి 150వ సినిమాకు బివిఎస్ రవి కథ అందిస్తున్నారు. యుఎస్‌కు చెందిన రచయిత దేవ్ వర్మ తన కథను ఎపి రైటర్స్ అసోశియేషన్ లో రిజిస్టర్ చేసానని, నా కథను కాపీ కొట్టి మార్పులు చేసి చిరంజీవి సినిమాకు కథ రెడీ చేసారని అంటున్నారు. దేవ్ వర్మ మాట్లాడుతూ.... " నేను 2011 లో ఈ కథను రాయటం మొదలెట్టాను. అంతేకాదు... కృష్ణం రాజు గారికి ఈ కథను చెప్పటం జరిగింది. ఆయన చాలా ఇష్టపడి..వెంటనే దాన్ని నిర్మించటానికి ముందుకు వచ్చారు. ప్రభాస్ అందులో నటించటానికి ఆసక్తి చూపారు. కానీ ...కొన్ని కారణాలు వల్ల మొదట అనుకున్నది వర్కవుట్ కాలేదు. తర్వాత...తమిళ,తెలుగు భాషల్లో దర్శకుడు ఎఆర్.మురగదాస్ ఆధ్వర్యంలో ముందుకు వెల్దామనుకున్నాం... అని చెప్పుకొచ్చారు.

    బి.వియస్ రవి దగ్గర ఉన్న కథ , మీ కథ ఒకటే అని ఎలా చెప్పగలరు? మీకు ఎలా తెలుసు? అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ... నటుడు సుబ్బరాజు నాకు మంచి మిత్రుడు. గత నవంబర్ లో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆయన్ను కలిసాను. అదే సమయంలో సుబ్బరాజు ని కలవటానికి రచయిత రవి వచ్చారు. అలా ఆ సమయంలో క్లుప్తంగా చిరు కథ ఇది అని స్టోరీ లైన్ చెప్పటం జరిగింది. అంతేకాదు ఒక్క అడుగు టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు రవి చెప్పారని అన్నారు. దాంతో ఆ కథ విని షాక్ అయ్యానని చెప్పారు.

    చిరంజీవి 150 వ సినిమా కోసం బివిఎస్ రవి - గోపి మోహన్ కలిసి అందించిన కథ కాపీ అంటూ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. కథలో ఎంటర్టైన్మెంట్ ట్రీట్ మెంట్ కోసం గోపీమోహన్ కి చెప్తే... ఆయన ద్వారా బి.విఎస్ రవి ఆ కథ వినటం జరిగిందని, అలా కథని ఎత్తేసారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో గోపీ మోహన్ ..స్పందించారు. గోపి మోహన్ స్పందిస్తూ ‘నేను బివిఎస్ రవితో కలిసి షేర్ చేసుకున్న కథని కాపీ అని పుకార్లు వస్తున్నాయి. వాటిల్లో అస్సలు నిజం లేదు. అలా వాదించే ఏ రైటర్ అయినా వచ్చి ధైర్యంగా రైటర్స్ యూనియన్ లో ఈ విషయాన్నీ పరిష్కరించుకోవచ్చని' గోపి మోహన్ తెలిపారు. యుఎస్ కి చెందిన వాసు దేవ్ వర్మ అనే రైటర్ చిరుకి చెప్పిన 150వ సినిమా కథ తనది అని రైటర్స్ పైన దావా చేసారు. కానీ ఈ విషయం పై స్పందించిన బివిఎస్ రవి తాము ఎవరి కథని కాపీ కొట్టలేదని అన్నారు.

    English summary
    Film Nagar source said tha, Chiru's 150th to start rolling from Pawan Kalyan's Birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X