twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తే మనోభావాలు దెబ్బతీయడమేనంట: నాగార్జునకు కొత్త చిక్కు!

    హథీరాం బావాజీ కథకు ఆయన పేరు పెట్టకుండా ఓం నమో వేంకటేశాయ అని పేరు పెట్టడం ఏమిటి అంటూ ఆందోళన కారులు ప్రశ్నించారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడిసాయి లాంటి చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

    షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న 'ఓం నమో వెంకటేశాయ' త్రం టైటిల్ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బంజారా అనే గిరిజన తెగకు చెందిన హథీరాం బావాజీ జీవిత నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆయన పేరు పెట్టకుండా ఓం నమో వెంకటేశాయ పేరు పెట్టం ఏమిటీ, వెంటనే సినిమాకు టైటిల్ మార్చాల్సిదే అంటూ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించారు.

    అన్నమయ్య, రామదాసు, తరిగొండ వెంగమాంబ వంటి భక్తుల కథను ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రాలకు వారి పేర్లే పెట్టినప్పుడు హథీరాం బావాజీ కథకు వచ్చేసరికి ఆయన పేరు పెట్టకుండా ఓం నమో వేంకటేశాయ అని పేరు పెట్టడం ఏమిటి, ఇలా చేయడం గిరిజనుల మనోభావాలు దెబ్బతీయడమే అని ఆందోళనకారులు వాదిస్తున్నారు.

     వెంటనే టైటిల్ మార్చండి

    వెంటనే టైటిల్ మార్చండి

    వెంటనే ఈ చిత్రం పేరును హథీరాం బావాజీ మహరాజ్‌గా మార్చాలి. లేకుంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని... తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సమాఖ్య నాయకులు పడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేసారు.

     హథీరాంజీ బావాజీ

    హథీరాంజీ బావాజీ

    ఉత్తరాదికి చెందిన హథీరాంజీ బావాజీ తిరుమలకు వచ్చి, స్వామిసేవలో తరించారు. అందుకే చాలా యేళ్ళు బావాజీ శిష్య పరంపరలో మహంతుల పాలనలో తితిదే ఉండేది. ఇప్పటికీ తిరుమలలో హథీరాంజీ మఠం ఉంది.

     ఓం నమో వెంకటేశాయ

    ఓం నమో వెంకటేశాయ

    అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తి కథా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్‌పై ఎ.మహేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 10న సినిమా విడుదలకు సిద్ధమైంది.

     నాగార్జున, రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్... (ఓ నమో... ఆడియో వేడుక)

    నాగార్జున, రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్... (ఓ నమో... ఆడియో వేడుక)

    అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం ఆడియో వేడుకలో నాగార్జున, రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    A fresh controversy has sparked off against the movie 'Om Namo Venkatesaya' directed by K Raghavendra Rao. Banjara Seva Sangham activists are opposing the title for not naming it after the Saint Hathiram Baba and instead they named it as 'Om Namo Venkatesaya'. They have demanded that this film also should be named after the devotee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X