twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిచ్చిన కోర్టు: శ్వేతా బసు 6 నెలలు లోపలే..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆ మధ్య వ్యభిచారం కేసులో అరెస్టయిన తెలుగు సినీ నటి శ్వేతా బసును పోలీసులు రెస్క్యూ హోంకు తరలించిన సంగతి తెలిసిందే. శ్వేతా బసును రెస్క్యూ హోం నుండి విడుదల చేయాలని ఆమె తల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్‌ను ఎర్రమంజిల్ కోర్టు తోసిపుచ్చింది. ఆరు నెలల పాటు శ్వేతా బసును రెస్య్కూ హోంలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆరు నెలల పాటు శ్వేతా బసు రెస్వ్యూ హోంలోనే ఉంటే...ఆమె సినిమా కెరీర్ పూర్తిగా పాడవుతుందని....ఆమె తల్లి ఆవేదన చెందుతోంది.

    కాగా...శ్వేతా బసుకు సినీ వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె కేవలం తన కుటుంబాన్ని కాపాడు కోవడానికే ఈ చీకటి కూపంలోకి దిగిందని పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరో మంచు లక్ష్మితో పాటు పలువరు బాలీవుడ్ దర్శకులు ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

    Court rejects petition of Swetha basu Prasad's mother

    మీడియా ఆమె వ్యవహారంపై అతిగా స్పందించడాన్ని కూడా రాజమౌళి లాంటి దర్శకులు తప్పుబట్టారు. ఇలాంటి కేసుల్లో గోప్యతను పాటించాల్సిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారు..మీడియాతో పాటు అందరూ ఆమెపై ముప్పేట దాడి ప్రారంభించారు. ఆమెతో పాటు పట్టుబడ్డ బిజినెస్ మేన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు..రేపు ఆమె ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ హిందీ టీవీ నటి సాక్షి తన్వర్ చేసిన వ్యాఖ్యలకు రాజమౌళి తన మద్దతు ప్రకటించారు.

    శ్వేతబసు హాట్ అండ్ సెక్సీ లుక్ :క్లిక్ చేయండి

    రోజు రోజుకు శ్వేతా బసుపై సినీ వర్గాల్లో సానుభూతి పెరుగుతుండటాన్ని చూస్తే.....రెస్క్యూ హోం నుండి విడుదలైన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

    English summary
    The Hyderabad Erra Manzil Court rejects petition filed by Swetha basu Prasad's mother. It has asked Banjara Hills police to put her in rescue home for 6 more months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X