»   » క్రికెటర్ తో సీక్రెట్ గా తిరుగుళ్లు, ఇన్నాళ్లూ దాచింది కానీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది (ఫొటోలు

క్రికెటర్ తో సీక్రెట్ గా తిరుగుళ్లు, ఇన్నాళ్లూ దాచింది కానీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది (ఫొటోలు

చక్‌దే ఇండియా సినిమా ఫేమ్‌ సాగరిక గట్గెతో భారత క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడని రివీలైంది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్ కు క్రికెట్ కు తొలి నుంచీ విడతీయని అనుబంధమేదో ఉంది. వీళ్ల రిలేషన్స్ ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో గీతా బర్శా ని హరి భజన్ సింగ్ వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా యువరాజ్ సింగ్ , విరాట్ కోహ్లి...ఇలా టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రేమకథలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.

ఇటీవలే ప్రేమజంట యువరాజ్‌సింగ్‌-హేజిల్‌కీచ్‌ జోడీ పెళ్లి పీటలెక్కగా ఎక్కగా.. మరో భారత క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌ కూడా అదే బాటలో ఉన్నాడు. చక్‌దే ఇండియా సినిమా ఫేమ్‌ సాగరిక గట్గెతో జహీర్‌ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.

అవును..బాలీవుడ్ లీడింగ్ డైలీ లో వచ్చిన వార్తలు ప్రకారం సాగరిక, జహీర్ గత నాలుగు నెలలుగా డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరూ పూర్తి స్దాయిలో ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఒకరినొకరు విడిచి ఉండలేని సిట్యువేషన్. కాకపోతే వీరి ప్రేమ వయస్సు నాలుగు నెలలే కావటంతో ఎక్కడివరకూ ఈ వ్యవహారం ముందుకు వెళ్తుందో చెప్పలేమంటున్నారు.

పెళ్లికి వెళ్లినప్పుడు

 

గోవాలో జరిగిన యువీ పెళ్లికి సాగరికతో కలిసి హాజరయ్యాడు. ఐతే తమ ప్రేమ వ్యవహారంపై మాత్రం జహీర్‌ స్వయంగా వెల్లడించలేదు. కానీ అక్కడ దిగిన ఫొటోలు, వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్న విషయాన్ని పట్టించాయి. ఈ విషయమై బాలీవుడ్ మీడియా గుప్పుమంటోంది.

 

తొలి ఎఫైర్ కాదు

 

బాలీవుడ్‌ తారతో జహీర్‌ లవ్ ఎఫైర్ సాగించాడని వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇషా శర్వాణితో అతను డేటింగ్‌ చేసినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. అయితే ఆ ఎఫైర్ మధ్యాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈమెతో ఎఫైర్ న్యూస్ వచ్చింది.

 

వీళ్ల బంధం బలంగా..

 

ఐతే సాగరికతో జహీర్‌ బంధం బలంగానే ఉందని అతని సన్నిహితులు చెబుతున్నారు. షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన చక్‌దే ఇండియా సినిమాలో సాగరిక భారత మహిళల హాకీ కెప్టెన్‌ ప్రీతి సబర్వాల్‌ పాత్ర పోషించింది.

 

స్వయంగా సాగరికే లీక్

 

ఇక ఈ విషయాన్ని సాగరిక తన సోషల్ నెట్ వర్కింగ్ మీడియా ద్వారా లీక్ చేసింది. జహీర్ ఖాన్ తో ఉన్న ఫొటోలు ట్విట్టర్ , ఫేస్ బుక్ లలో పోస్ట్ చేసింది. అయితే గ్రూప్ లలో ఆ ఫొటోలు పోస్ట్ చేసింది. కామన్ ప్రెండ్స్ లాగ ఈ ఫొటోలు ఉండేలా జాగ్రత్త పడింది.

 

కలిసే రాత్రింబవళ్లూ..

 

ఈ జంట...పార్టీలకు, ఈవెంట్స్ కు కలిసి హాజరవుతోంది. ఈ విషయాన్ని లీడింగ్ డైలీ రాసుకొచ్చిన ఆర్టికల్ లో రాసింది. అయితే వీరి ప్రేమ ఎక్కడ మొదలైంది...అనే విషయం మాత్రం తెలియరాలేదు. కానీ వీళ్లిద్దరూ గాడమైన ప్రేమలో ఉన్న విషయం బాలీవుడ్ సర్కిల్స్ లో ఫేమస్ అయ్యిపోయింది.

 

English summary
Rumours are doing the rounds that cricketer Zaheer Khan is dating Chak De India girl Sagarika Ghatge as the duo were seen attending Yuvraj Singh and Hazel Keech's wedding together in Jaipur and Goa.
Please Wait while comments are loading...