twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిలు తమ నీడను కూడా నమ్మొద్దు: మోహన్ బాబు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మోమన్ బాబు సమర్పణలో మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బేనర్లో మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో జి నాగేశ్వరరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కరెంటు తీగ'. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక బుధవారం హైదరాబాద్ లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది.

    ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికపై హుధూద్ తుఫాన్ కు సంబంధించి అచ్చు స్వరపరిచిన పాటను విడుదల చేసారు. అనంతరం ‘కరెంటు తీగ' చిత్రానకి సంబంధించిన ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి, శాంతాబయోటిర్స్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ...‘నారాయణమ్మ కాలేజీలో క్రమశిక్షణ చాలా బాగుంటుంది. మాకు కూడా ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ మిడ్డీలు, టైట్స్, సెల్ ఫోన్లకు అనుమతి ఉండదు. అమ్మాయిలు సెల్ ఫోన్లు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. అమ్మాయిలు తమ నీడలను కూడా నమ్మకూడదు. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా కాకుండా అంతా కలిసి వెళ్లాలి. తుఫాన్ కారణంగా నష్టపోయిన విశాఖ వాసులను ఆదుకోవడానికి మన వంతు సాయం చేయాలి. నేను నిజాయితీగా మాట్లాడతాను. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని చాలా బాగా తీసాడు. సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా...తుఫాన్ కారణంగా వాయిదా వేసాం' అన్నారు. స్లైడ్ షోలో ఫోటోలు...

    మోహన్ బాబు

    మోహన్ బాబు


    కరెంటు తీగ ప్లాటినమ్ డిస్క్ వేడుకలో మాట్లాడుతున్న మోహన్ బాబు.

    మంచు మనోజ్

    మంచు మనోజ్


    ఈ చిత్రంపై మంచు మనోజ్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. సినిమా వినోదాత్మకంగా సాగుతుందని తెలిపారు.

    ప్లాటినమ్ డిస్క్

    ప్లాటినమ్ డిస్క్


    ప్లాటిన్ డిస్క్ లను అందుకుంటున్న దర్శకుడు నాగేశ్వర రెడ్డి, మంచు మనోజ్.

    విద్యార్థులు..

    విద్యార్థులు..


    ప్లాటినమ్ డిస్క్ వేడుకలో పాల్గొన్న నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు.

    English summary
    Telugu Movie Current Theega Platinum Disc. Manchu Manoj and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X