twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌ టెంపర్‌తో...రామోజీ దాగుడు మూతల దండాకోర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే ఓ వారం, రెండు వారాల దాకా పోటీగా మరే సినిమా కూడా రాదు. అయితే ఈ సారి ఓ చిన్న సినిమా ‘టెంపర్'తో పాటే అదే రోజు విడుదలవోతంది. అది మరేదో కాదు రామోజీరావు నిర్మాతగా తెరకెక్కిన ‘దాగుడు మూతల దండాకోర్'. వాస్తవానికి టెంపర్ లాంటి పెద్ద చిత్రంతో పోటీ పడటం ఇష్టం లేక పోయినా...పరిస్థితుల ప్రభావంతో తప్పడం లేదట. ఇపుడు వాయిదా సినిమా మరో రెండు మూడు నెలలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. టెంపర్ సినిమా యాక్షన్, తమది ఫ్యామిలీ మూవీ కాబట్టి పెద్దగా తమ సినిమాపై ప్రభావం ఉండదని రామోజీ భావిస్తున్నారట.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ‘దాగుడు మూతల దండాకోర్' సినిమా విషయానికొస్తే...నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో వైవిధ్యమైన పాత్రలో ‘దాగుడుమూతల దండాకోర్' లో తెరమీదకు రానున్నాడు. ఇందులో ఈయనదే ప్రధాన పాత్ర. ఊరి పెద్ద. ఈయనతో సరిసమాన ప్రాధాన్యత గల పాత్ర చిన్నారి సారా(నాన్నలో నటించింది)ది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథాంశం శైవం అనే తమిళ సినిమా నుంచి తీసుకున్నారు. శైవంలో నాజర్ చేసిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తున్నాడు.

    Dagudumuthala Dandakore releasing on Feb 13th

    కథ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ ది చాలా పెద్ద కుటుంబం. ముగ్గురుకుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరూ సెలవులకు తప్పనిసరిగా తమ సొంతూరు చేరుకుంటారు. అక్కడ తమ దేవతను దర్శించుకునే ఆచారాన్ని వారు పాటిస్తారు. కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినప్పుడు దేవతకు కోడిపుంజును బలి ఇచ్చే ఆచారం ఆ ఊర్లో ఉంటుంది. అయితే రాజేంద్రప్రసాద్ మనవరాలు సారాకు కోడిపుంజును బలి చంపడం అనే కార్యక్రమం నచ్చదు. కోడిపుంజును బలి ఇచ్చే తంతు జరపడానికి వారు సిద్ధపడుతుండగా దాన్ని ఆ పిల్ల దాచిపెట్టడం, దానికోసం కుటుంబమంతా గాలించడం... సినిమాలో ఎక్కువ భాగం ఇదే నడుస్తుంది.

    Dagudumuthala Dandakore releasing on Feb 13th

    ఆ పాపకు ఆ పుంజంటే ప్రాణం... అమాయకంగా తను ఆ పుంజుకోసం పడే తపనే చివరి ట్విస్ట్. ఈ సినిమా చూసి తమిళనాడులోని కొన్ని గ్రామాలు పుంజును బలివ్వడం అనే ఆచారాన్ని వదిలిపెట్టేశారట. అంతే కాదు కొన్ని గ్రామాల్లో కోళ్లు తినడం మానేశారట. ఈ సినిమా ఇంతలా ప్రభావితం చేసిందంటే.... ఎంత హార్ట్ టచింగ్ గా ఈ సినిమాను తీసుంటారో, ఇట్టే అర్థమై పోతుంది... మరి తెలుగు సినిమా ప్రేక్షకులను ఈ సినిమా ఎంతలా ఆకట్టుకోగలదో వేచి చూడాల్సిందే.

    English summary
    Rajendra Prasad's Dagudu Muthala Dandakore releasing on Feb 13th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X