» 

'దండుపాళ్యం' దర్శకుడితో శ్రీకాంత్‌ ఖరారు...డిటేల్స్

Posted by:

హైదరాబాద్‌: కుటుంబ కథా చిత్రాల హీరో శ్రీకాంత్‌.. దండుపాళ్యం దర్శకుడు శ్రీనివాసరాజు కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేమకథా చిత్రం అని చెప్తున్నారు. శ్రీనివాసరాజు చెప్పిన కథకు ఫిదా అయిన శ్రీకాంత్‌ సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడే ప్రకటించడం విశేషం.

శ్రీకాంత్‌తో తీయబోయే చిత్రాన్ని కన్నడలో ఉపేంద్రతోనూ తీసేందుకు శ్రీనివాసరాజు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఘన విజయాన్ని అందుకున్న దండుపాళ్యానికి కొనసాగింపుగా దండుపాళ్యం - 2ను కూడా తీసుకురాబోతున్నట్లు దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు. ఇక గోపీచంద్ తో కూడా ఈ దర్శకుడు ఓ చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.


మరోప్రక్క ఎవిఎమ్ మూవీస్ పతాకంపై శ్రీకాంత్, కుంకుమ్ జంటగా దర్శకుడు ఉదయ్‌చందు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి 'క్షత్రియ'అనే టైటిల్ ని పెట్టారు. మహేంద్రవర్మ, ఎ.విజయలక్ష్మి, ముదిళ్ల జెయేంద్ర రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'వంద చిత్రాలు పూర్తి చేసుకున్న శ్రీకాంత్‌ను ఈ చిత్రంలో కొత్తగా చూపించబోతున్నాం. సరికొత్త మాస్ అంశాలతో పాటు ప్రేక్షకులను ఉత్కం గురిచేసే అంశాలు ఇందులో వుంటాయి. ఇప్పటికి మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. శ్రీకాంత్‌కు మంచి విజయాన్ని అందిస్తుంది' అన్నారు.

Read more about: srikanth, gopichand, dandupalyam, శ్రీకాంత్, దండుపాళ్యం, గోపీచంద్
English summary
Srinivasa Raju, the director of recently released 'Dandupalyam' movie will soon direct a bilingual movie with Srikanth as hero. 'Dandupalyam', the Telugu version of Kannada block buster 'Dandupalya', has been received very well by the Telugu audience.
Please Wait while comments are loading...