twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓవర్సీస్‌లో బాహుబలి, దంగల్ అల్లకల్లోలం.. హాలీవుడ్‌ సినిమాలకు దెబ్బ.. ముప్పు..

    By Rajababu
    |

    ప్రపంచ సినిమాపై ఎన్నో ఏళ్లుగా హాలీవుడ్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి బాహుబలి2, దంగల్ చిత్రాలు గండికొడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు సృష్టిస్తున్న కలెక్షన్ల అల్లకల్లోలం హాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. అమెరికా బాక్సాఫీస్ వద్ద బాహుబలి2 రూ.122.78 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ నటులు ఎమ్మా వాట్సన్, టామ్ హాంక్స్ నటించిన ది సర్కిల్ సినిమాను కూడా వెనక్కి నెట్టడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ రెండు చిత్రాలు హాలీవుడ్ సినిమాలకు, అవి సాధిస్తున్న కలెక్షన్లకు ముప్పుగా మారాయనే భావన వ్యక్తమవుతున్నది.

    హాలీవుడ్ సినిమాలకు దెబ్బ

    హాలీవుడ్ సినిమాలకు దెబ్బ

    మరోపక్క చైనాలో మే 5వ తేదీన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ విడుదలైంది. రిలీజైన నాలుగో రోజుకే ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా దంగల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. అదే జోరును కొనసాగిస్తూ చైనా బాక్సాఫీస్ వద్ద దంగల్ నెంబర్ వన్‌గా నిలిచింది. దంగల్ జోరు ముందు హాలీవుడ్ చిత్రం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ2 చిత్రం చిన్నబోయింది.

    చైనాలో దంగల్ సునామీ..

    చైనాలో దంగల్ సునామీ..

    తాజా గణాంకాల ప్రకారం చైనాలో దంగల్ రూ.385 కోట్లు వసూళు చేసింది. ఈ సినిమా భారత్‌లో వసూలు చేసిన మొత్తం కంటే కేవలం రూ.2 కోట్లు మాత్రమే తక్కువ కావడం గమనార్హం. ఒక ఇండియన్ చిత్రం స్వదేశంలో కాకుండా విదేశాల్లో ఇంత భారీగా వసూలు చేయడం ఇదే మొదటిసారి. ఒక్క చైనాలోనే రూ.400 కోట్లు సాధించే చిత్రంగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నది.

    ప్రపంచవ్యాప్తంగా బాహుబలి..

    ప్రపంచవ్యాప్తంగా బాహుబలి..

    ఇక బాహుబలి సృష్టిస్తున్న ప్రభంజనం మాటల్లో చెప్పలేనిది. అది సాధిస్తున్న కలెక్షన్లే బాహుబలి సత్తాను చెప్తున్నది. భారతీయ సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బాహుబలి రూ.1000 కోట్ల మార్కును అధిగమించింది. ప్రస్తుతం రూ.1400 కోట్లకుపైగా వసూళ్లను సాధించి అరుదైన రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.

    రెండు చిత్రాలపై హాలీవుడ్ ఆరా..

    రెండు చిత్రాలపై హాలీవుడ్ ఆరా..

    బాహుబలి2, దంగల్ సినిమాల కలెక్షన్లపై ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందజేస్తున్నారు. బాహుబలి, దంగల్ సినిమాల కలెక్షన్ల సునామీని హలీవుడ్ స్టూడియోస్, అంతర్జాతీయ మీడియా నిశితంగా పరిశీలిస్తున్నది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని గమనిస్తూ ఈ రెండు చిత్రాలు హాలీవుడ్‌ కలెక్షన్లకు ముప్పుగా మారాయనే భావనలో ఉన్నాయి.

    హీరోలు కాదు.. కథే ఆకట్టుకొంటున్నదట..

    హీరోలు కాదు.. కథే ఆకట్టుకొంటున్నదట..

    బాహుబలి, దంగల్ చిత్రాలు కథాపరంగా, సాంకేతిక పరంగా గొప్పగా ఉన్నాయనే అభిప్రాయాన్ని అంతర్జాతీయ మీడియా వ్యక్తం చేస్తున్నది. విదేశీ ప్రేక్షకులకు ప్రభాస్ గానీ, అమీర్ ఖాన్ గానీ, రాజమౌళిని చూసి వెళ్లడం లేదని, కేవలం ఈ రెండు చిత్రాల్లో ఉన్న ఎమోషన్స్, కథ చెప్పే విధానం విశేషంగా ఆకట్టుకొంటున్నాయని కథనాలను వెల్లడిస్తున్నాయి.

    English summary
    The box-office mayhem caused by Dangal and Baahubali 2 worldwide signals the challenge Indian cinema can pose to Hollywood's hegemony over global markets.Truly, as trade Analyst Ramesh Bala tweeted, Hollywood studios and international media are taking note of two Indian films, Baahubali 2 and Dangal, creating havoc at the global box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X