twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ ‘దంగల్‌’ చూసినవాళ్లు ఏమన్నారంటే

    ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న అమీర్ ఖాన్ ‘దంగల్‌’ సెలబ్రెటీలు రివ్యూలు ఇక్కడ చదవండి.

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో లెంజడరీ రెజ్లర్‌ మహావీర్‌ పోగట్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'దంగల్‌'. పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత ఆమిర్‌ 'దంగల్‌'తో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధం అయ్యారు.

    నితేష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డిస్నీ వరల్డ్‌ సినిమా, ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రీతమ్‌ చిత్రానికి సంగీతం అందించారు. ఈ శుక్రవారం 'దంగల్‌' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    ఈ శుక్రవారం రిలీజ్ సందర్బంగా ఈ చిత్రం స్పెషల్ షోలు వేసారు. ఈ షోలకు బాలీవుడ్ స్టార్స్ మొత్తం హాజరయ్యారు. ఈ షోలకు హాజరైన బాలీవుడ్‌ ప్రముఖులు సినిమా చూసాక... సోషల్‌మీడియా వేదికగా చిత్ర యూనిట్ ని ప్రశంసించారు.

    అనిల్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, తుస్సార్‌ తదితరులు ట్విట్టర్‌ వేదికగా 'దంగల్‌' బృందాన్ని అభినందించారు. దాదాపు చూసిన అందరూ ..ఇది చక్కటి, స్ఫూర్తిదాయకమైన చిత్రమని ట్వీట్‌ చేశారు. ఆమిర్‌ ఖాన్‌ అంకితభావంతో పనిచేశారని, భావోద్వేగాలతో కూడుకున్న చిత్రమని పేర్కొన్నారు.

    మహిళా సాధికారిత, క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో తీసిన ఈ సినిమాలో రెజ్లింగ్‌ క్రీడాకారుడిగా, తన కూతుళ్లకు మల్లయుద్ధం నేర్పించే తండ్రిగా రెండు విభిన్నమైన పాత్రలో ఆమిర్‌ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమాను చూసి బాలీవుడ్‌ ప్రముఖులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

    స్పెల్ బౌండ్ అంటే ఇదే

    ఎంత అద్భుతమైన సినిమా దంగల్‌! దేశ క్రీడలకు, మహిళలకు ఈ సినిమా ఒక ముఖ్యమైన ఈవెంట్‌. ఆమిర్‌ఖాన్‌ మరోసారి మనలో స్ఫూర్తి నింపుతారు. అమీర్ ఖాన్ స్పెల్ బౌండ్ చేసేసారు. అద్బుతం అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. అర్జున్ కపూర్ చేసిన ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

    లాండ్ మార్క్ ..

    లాండ్ మార్క్ ..

    దంగల్‌లో ఆమిర్‌ ల్యాండ్‌మార్క్‌ పర్ఫార్మెన్స్‌ చూపించారు. ఇద్దరు అమ్మాయిలు కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు నితీశ్‌ తివారీ బహుముఖ భావోద్వేగాలతో సినిమాను రూపొందించారు. అంటూ లిరిక్ రైటర్ చెప్పుకొచ్చారు ట్విట్టర్ ద్వారా.

    నటుడు, నిర్మాత తుషార్

    నటుడు, నిర్మాత తుషార్

    చాలా బ్యూటీఫుల్ గా , ఎమోషనల్ గా, రియలిస్టిగ్ గా సినిమా సాగింది. అంతేకాదు చాలా సస్పెన్స్ తో సినిమా ఉంది. స్పోర్ట్స్ ఫిల్మ్ లలో ఇలాంటి ఫీట్ అరుదుగా జరుగుతుంది. ఎపిక్ దంగల్ అంటూ ట్వీట్ చేసారు.

    పెద్ద బ్లాక్ బస్టర్

    పెద్ద బ్లాక్ బస్టర్

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ వారి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దంగల్ చిత్రం చాలా చాలా మంచి సినిమా. బాలీవుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి పోయే చిత్రం అని కమాల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసారు.

    బెస్ట్ చిత్రం

    బెస్ట్ చిత్రం

    డైరెక్టర్‌ ఫర్హాఖాన్‌ భర్త , దర్సకుడు అయిన శిరీష్‌ కుందర్‌ ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ...'నేను చాలాకాలం నుంచి చూస్తున్న సినిమాల్లో ఉత్తమ సినిమా 'దంగల్‌'. మున్ముందు కూడా ఒక గొప్ప సినిమాగా ఇది నిలిచిపోతుంది. సెల్యూట్‌ ఆమిర్‌ సర్‌. య ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ చిత్రం ఇది. అమీర్ ఖాన్ కు సెల్యూట్ అంటూ సినిమా ని పొగడ్తల్లో ముంచెత్తారు.

    ఎమోషన్స్

    ఎమోషన్స్

    దంగల్ చాలా అందంగా ఎమోషన్స్ ని చూపెడుతూ చేసిన చిత్రం. ఈ సినిమా మనని కదిలిస్తుంది..ప్రేరేపిస్తుంది. ఓ గొప్ప భావనతో ధియోటర్ నుంచి వచ్చేటప్పుడు ఫీల్ మిగిలుస్తుంది.

    మాటలు రావటం లేదు

    మాటలు రావటం లేదు

    ఈ సినిమాని ఎలా వర్ణించాలో తెలియటం లేదు. మాటలు రావటం లేదు. పదాలు దొరకటం లేదు. దంగల్ గొప్ప చిత్రం అంటూ తుషార్ ట్వీట్ చేసారు.

    అవుట్ స్టాండింగ్

    అవుట్ స్టాండింగ్

    పొలిటీషయన్ మిలింద్ ట్వీట్ చేస్తూ... దంగల్‌ చిత్రబృందానికి తలవొంచి ప్రమాణం చేస్తున్నా. అద్భుతమైన స్ర్కీన్‌ప్లే. సంగీతం. ఆమిర్‌ఖాన్‌ ఇతర నటులు అద్భుతంగా నటించారు, దంగల్ టీమ్ కు అభినందనలు. అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఫెరఫార్మెన్స్ అంటూ ఆయన మెచ్చుకుంటూ ఈ సినిమా గురించి ట్వీట్ చేసారు.

    ఈ దశాబ్దంలోనే..

    ఈ దశాబ్దంలోనే..

    ఇప్పుడే దంగల్ చిత్రం చూసాను. ఈ దశాబ్దంలోనే ఇలాంటి అద్బుతమైన సినిమా చూడలేదు అంటూ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ ట్వీట్ చేసారు.

    ఏ స్టాండర్డ్స్ లో చూసుకున్నా

    ఏ స్టాండర్డ్స్ లో చూసుకున్నా

    అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఏ స్టాండర్డ్స్ లో చూసుకున్నా బెస్ట్ సినిమానే. ఈ టీమ్ మరియు క్రూ అందరికీ హ్యాట్సాఫ్ అంటూ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఈ సినిమా గురించి ట్వీట్ చేసారు.

    రెండు విభిన్న పాత్రలు

    రెండు విభిన్న పాత్రలు

    బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ లెజండరీ రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన దంగల్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమీర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు.

    బరువు పెంచి, తగ్గించటం

    బరువు పెంచి, తగ్గించటం

    ఓల్డ్ లుక్ పాత్ర కోసం 97 కేజీల బరువు టచ్ చేసిన ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ యంగర్ పార్ట్ కోసం 30 కేజీల బరువు తగ్గాడు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటీవల ఈ చిత్రాన్ని రజినీకాంత్ తో పాటు ఆయన ఫ్యామిలీ కి స్పెషల్ షో ద్వారా చూపించారు అమీర్ .

    బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటూ..

    బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటూ..

    అలాగే ఈ సినిమాని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, హాట్ బ్యూటీ సన్నిలియోన్ లతో పాటు మహవీర్‌సింగ్‌ ఫోగట్‌ కుటుంబ సభ్యులు కూడా చూపించారని సమాచారం. ఈ చిత్రం అమీర్ కెరియర్ లో బెస్ట్ చిత్రంగా నిలుస్తోందని వారు తెలిపారు.

    కూతుళ్ల కోసం తండ్రి

    కూతుళ్ల కోసం తండ్రి

    తన కూతుళ్ళకు మల్ల యుద్దం నేర్పించే తండ్రిగా అమీర్ నటన గొప్పగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. దంగల్ చిత్రం తెలుగులో యుద్ధం టైటిల్ తో విడుదల కానుంది. అమీర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ బట్నాగర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానికి పోరాడే తండ్రి నేపధ్యంలో తెరకెక్కిన దంగల్ చిత్రం అభిమానులను ఏ రేంజ్ లో అలరిస్తోందో చూడాలి.

    యుద్దం ట్రైలర్

    ఈ చిత్రం తెలుగులో యుద్దం టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ కు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

    English summary
    Aamir Khan recently organized a special screening of his movie Dangal for his friends. Read the celebrity review of the movie Dangal here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X