twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి నిలువెత్తు విగ్రహం సిద్దం: ఫిలిమ్ నగర్ లో 9 అడుగుల మరో భారీ విగ్రహం

    దాసరి కాంస్య విగ్రహాన్ని కుటుంబీకులు తయారు చేయిస్తున్నారు. విశాఖఫట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్ దాసరి విగ్రహం ఇప్పటికే తయారు చేసారు.

    |

    దర్శకరత్న దాసరి... తెలుగు సినిమా దార్శనికుల్లో ఒకడు, టాలీవుడ్ పెద్దదిక్కు, చిన్న దర్శకులకూ, నిర్మాతలకూ ఒక దైర్యం.దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటూ తెర వెనక సృజనశీలురకు మహోన్నతమైన గౌరవాన్ని సంపాదించిపెట్టిన సినిమా లెజెండ్. యాభైఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ప్రతి అడుగులో తనదైన ముద్రను వేశారు. విలక్షణ కథా చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో సంచలనాల్ని సృష్టించారు. 151 చిత్రాలకు దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించి అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కారు. ఇన్ని సాధించిన దాసరి ఇక విశ్రాంతికోసం వెళ్ళిపోయారు...

    గురువుగారు

    గురువుగారు

    పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, పరిశ్రమకి ఏ సంక్షోభం వచ్చినా అందరికీ గుర్తొచ్చేది "గురువుగారు". సమస్య ఏదైనా.. ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు ‘ఒకసారి గురువుగారితోనూ చర్చించి, నిర్ణయం తీసుకుంటాం' అని చెప్తుంటారు. దాసరి అనే వృక్షం నీడన తలదాచుకుని ఎదిగిన వాళ్లు..,

    నిలువెత్తు విగ్రహం

    నిలువెత్తు విగ్రహం

    చిన్నా, పెద్ద తేడా లేకుండా ‘సమస్య' అనగానే దాసరి పాదాలపై వాలిన వాళ్లు పెద్ద దిక్కు చనిపోతే ఎలా భరించగలరు? అందుకే ఇప్పుడు ఆయన నిలువెత్తు విగ్రహం సిద్దమవుతోంది, అంతే కాదు ఫిలిం నగర్ లో నిలబడటానికి తొమ్మిదడుగుల మరో భారీవిగ్రహం కూడా తరారవుతోంది...

    11న దాసరి పెద కర్మ

    11న దాసరి పెద కర్మ

    ఈ నెల 11న దాసరి నారాయణరావు పెద కర్మ జరగనుంది. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని కుటుంబీకులు తయారు చేయిస్తున్నారు. విశాఖఫట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్ కు ఈ బాధ్యత అప్పగించారు. ఈ మేరకు దాసరి విగ్రహం ఇప్పటికే తయారైంది.

    ఫిలింనగర్ లో పెట్టడానికి

    ఫిలింనగర్ లో పెట్టడానికి

    దానికి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. 11వ తేదీన మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఫిలింనగర్ లో పెట్టడానికి తొమ్మిది అడుగుల ఎత్తయిన విగ్రహం కూడా తయారు చేయాలని దాసరి కుటుంబీకులు కోరినట్లు శిల్పి కామధేనువు ప్రసాద్ చెబుతున్నారు. ప్రస్తుత విగ్రహం పూర్తయిన తర్వాత దాని తయారీ ప్రారంభిస్తామన్నారు.

    English summary
    Dasari Bronze statue to be Unveiled on this 11 June, and another Bronze statue is getting ready to placed at Filmnagar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X