twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్ నాతో సినిమా చేద్దామన్నారు, కానీ...: దాసరి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు కేసీఆర్ నాతో సినిమా చేద్దామన్నారు...ఎందుకనో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు అంటూ తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. తన పుట్టినరోజు సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

    ఎన్నో ఏళ్ల నుంచి కేసీఆర్‌కు, నాకు మధ్య చక్కటి అనుబంధముంది. ఆయన ఎప్పుడు పిలిచినా వస్తాను. కేసీఆర్ గొప్ప విషయ పరిజ్ఞానం వున్న వ్యక్తి. ఆయన పుస్తకాలు బాగా చదువుతాడు. పురాణాలు, ఇతిహాసాల మీద మంచి పట్టుంది. ఎలాంటి అంశంపైనైనా సాధికారికంగా మాట్లాడగలడు అన్నారు.

    హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా తీర్చిదిద్దుతాననే కేసీఆర్ సంకల్పం చాలా గొప్పది. విస్తృత ప్రయోజనాలను నెరవేర్చే సినిమా హబ్ గురించి ఇప్పటివరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. 2000ఎకరాల్లో ఫిల్మ్‌సిటీ పూర్తయితే బాలీవుడ్, హాలీవుడ్సి నిమాల్ని కూడా ఇక్కడ చిత్రీకరించే వీలుకలుగుతుంది అని ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    Dasari Narayana Rao about KCR

    తెలుగు సినిమా పరిశ్రమ విశాఖకు తరలి వెలుతుందనే అంశంపై స్పందిస్తూ.....
    ఎందరో కృషి ఫలితంగా మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ తరలివచ్చింది. ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాల సబ్సిడీలు అందించి అందుకు సహకరించాయి. అయితే తొలిరోజుల్లో చాలా మంది హైదరాబాద్‌కు రావడం...సినిమా ఆఫీస్‌ను మొదలుపెట్టడం...సబ్సిడీలు పొందగానే తిరిగి మద్రాస్‌కు వెళ్లడం చేసేవారు. ఎవరో కొందరు నిర్మాతలు మాత్రమే నిజాయితీగా ఇక్కడ స్థిరపడే ప్రయత్నాలు చేశారు. అయితే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు పూర్తిగా తరలిరావాలంటే ఏం చేయాలనే విషయమై నా సలహా అడిగారు. మూడురోజులు షూటింగ్‌లకు విరామమిచ్చి ఓ చక్కటి ప్లాన్‌ను చెన్నారెడ్డి ముందుంచాను.

    ఆ రోజుల్లో మద్రాస్‌లో వినోదపు పన్ను 24 శాతం వుండేది. హైదరాబాద్‌కు పరిశ్రమ రావాలంటే 6శాతం పన్ను విధానం పెట్టాలని చెప్పాను. నేను సూచించిన ప్లాన్‌ను చెన్నారెడ్డి అమలుచేశారు. దాంతో హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ పూర్తిగా తరలిరావడానికి అవకాశమేర్పడింది. దాదాపు 20ఏళ్ల్ల అవిశ్రాంత కృషి ఫలితంగా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో స్థిరపడగలిగింది.

    ఇక్కడ నుంచి తిరిగి విశాఖపట్నంకు తరలిపోవాలంటే అందుకు ఎంతో శ్రమ, సమయం అవసరమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ అంత రిస్క్ తీసుకోరనుకుంటున్నాను. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో వేళ్లూనుకోని పోయింది. నా వరకైతే ఇండస్ట్రీ ఇక్కడనుంచి తరలిపోతుందని భావించడం లేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ వల్ల సినిమా నిర్మాణానికి ఓ స్థావరం అవసరం లేదని నా అభిప్రాయం. సాంకేతికతను ఉపయోగించుకొని ఎక్కడ నుంచైనా సినిమాలు తీయొచ్చు అని చెప్పుకొచ్చారు.

    English summary
    Dasari Narayana Rao asked every Telugu Film Personality to cooperate with KCR in all the stands and he suggested one should give opportunity and way for KCR to make Telugu Industry in Hyderabad a Big Hub for Indian cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X