»   » హాస్పిటల్ బెడ్‌పైనే కొత్త సినిమా కథను.. దటీజ్ దాసరి..

హాస్పిటల్ బెడ్‌పైనే కొత్త సినిమా కథను.. దటీజ్ దాసరి..

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు. అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్న దాసరిని మంగళవారం అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని అచ్చిరెడ్డి ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.

దాసరి నారాయణ దాదాపు పూర్తిగా కోలుకొంటున్నారు. కృష్ణారెడ్డి రూపొందించబోయే కొత్త సినిమా కథ గురించి స్వయంగా గుర్తు చేసి తెలుసుకొన్నారు. భారీ విజయం సాధించాలని మమ్మల్ని ఆశీర్వదించారు. అదీ ఆయన గొప్పదనం. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ దాసరి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నారని అచ్చిరెడ్డి తెలిపారు.

English summary
Producer Atchi Reddy, director Krishna Reddy met Director Dasari Narayana Rao in hospital. Atchi Reddy said, his health condition is stable, he has recovered fully. Soon he will be discharged from the KIMs hospital.
Please Wait while comments are loading...