twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాత మనవడుతో ప్రారంభమై.. తాత మనవడిగానే.. దివికేగిన దర్శకరత్న.. కారణజన్ముడే..

    తాతా మనవడుతో ప్రారంభమైన సినీ ప్రస్థానం ఎర్రబస్సు వరకు నిరాటకంగా సాగింది. సామాజిక అంశాలు, అవినీతి, మహిళా సమస్యలపై ఆయన ఎక్కుపెట్టిన సినీ అస్త్రానికి ఎదురేలేకుండా పోయింది. దాసరి నిర్మించిన చిత్రాలు సినీ

    By Rajababu
    |

    తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించిన సినీ ప్రముఖుల్లో దర్శకుడు దాసరి నారాయణరావుదే అగ్రస్థానం. అత్యధిక చిత్రాల్ని తెరకెక్కించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించిన ఖ్యాతిని ఆయన సొంతం చేసుకొన్నారు. తాతా మనవడుతో ప్రారంభమైన సినీ ప్రస్థానం ఎర్రబస్సు వరకు నిరాటకంగా సాగింది.

    Dasari Narayanarao carrer starts with Tata Manavadu and ends with Erra bassu

    సామాజిక అంశాలు, అవినీతి, మహిళా సమస్యలపై ఆయన ఎక్కుపెట్టిన సినీ అస్త్రానికి ఎదురేలేకుండా పోయింది. దాసరి నిర్మించిన చిత్రాలు సినీ పరిశ్రమలో ఆణిముత్యాలుగా నిలిచాయి. అయితే ఆయన సినిమా జీవితాన్ని పరిశీలిస్తే ఓ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించవచ్చు.

    సామాన్యుడే కథా నేపథ్యం..

    సామాన్యుడే కథా నేపథ్యం..

    దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. సాధారణ ప్రజల సమస్యలే దాసరి చిత్రాలకు నేపథ్యం. మధ్య తరగతి జీవితాల ఆక్రందనలే ఆయన పాత్రలకు ప్రతిబింబాలు. వాణిజ్య చిత్రానికి కొత్త అర్థాన్ని చెప్పిన సినీదిగ్గజం దాసరి నారాయణరావు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లాంటి ఉద్ధండుల సినీ జీవితాల్ని మలుపు తిప్పేలా చిత్రాల్ని తీసిన ఘనత ఆయనది. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నేతగా విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ వర్గానికి అత్యంత ప్రీతిపాత్రులు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

    కెప్టెన్ ఆఫ్ ది షిప్

    కెప్టెన్ ఆఫ్ ది షిప్

    దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని రుజువు చేశాడు. రచయితగా కలానికీ గౌరవం తెచ్చిపెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు. ఆయన రాసిన పాటలు తక్కువే అయినా వినూత్నమైన భావజాలంతో ఆకట్టుకున్నాయి. తన తొలి చిత్రం ‘తాత మనవడు'లో ‘సోమ మంగళ బుధ..' పాట పల్లవి ఆయనదే. తొలిసారిగా ఆయన ‘మనుషులంతా ఒక్కటే'లో ఓ పాట రాశారు.

    తాత మనవడుతో ప్రారంభమై..

    తాత మనవడుతో ప్రారంభమై..

    దర్శకుడిగా తొలిచిత్రం తాత మనవవడు చిత్రంతో ఆయన సినీ మజిలీ ప్రారంభమైంది. అప్పటి నుంచి చరిత్రలో నిలిచిపోయే సినిమాలను రూపొందించారు. శివరంజని, తూర్పుపడమర, స్వర్గం నరకం, కేటుగాడు, కటకటాల రుద్రయ్య, బొబ్బిలిపులి, సర్ధార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, పరమమీర చక్ర తదితర చిత్రాలను రూపొందించారు. ఆయన చివరి చిత్రం మంచు విష్ణు నటించిన ఎర్రబస్సు. ఈ చిత్రంలో దాసరి ఓ పత్యేకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

    తాత మనవడుగానే దివికేగిన కారణజన్ముడు..

    తాత మనవడుగానే దివికేగిన కారణజన్ముడు..

    తన తొలిచిత్ర ఇతివృత్తం తాత మనవడు మధ్య జరిగిన మానసిక సంఘర్షణ. మానవ సంబంధాలను విశ్లేషిస్తూ సాగిన చిత్రమది. అలాగే ఆయన నటించిన చివరి చిత్రం ఎర్రబస్సు. ఈ చిత్రంలో మంచు విష్ణుకు తాత పాత్రను పోషించాడు. యాదృచ్చికమో ఏమో గానీ.. ఆయన మొదటి, చివరి చిత్రం తాతా మనవడు సంబంధాలపైనే రూపొందండం గమనార్హం. ఇలాంటి అరుదైన పరిస్థితి కారణజన్ములకే దక్కుతుందనే మాటను పలువురు ప్రస్తావిస్తున్నారు.

    English summary
    Dasari Narayanarao carrer starts with Tata Manavadu and ends with Errabassu. One interesting incident is in both movies are picturised on grand father and grand son relations. This is spantenously happend in Dasari Narayanarao career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X