twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజర్ ఫెడరర్‌కు దీపిక, అమితాబ్ డాన్స్ పాఠాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియాలో రెండే రెండు మతాలు...అందులో ఒకటి సినిమా, రెండోది క్రికెట్. త్వరలో టెన్నిస్ కూడా ఈ లిస్టులో చేరుతుందని అభిప్రాయ పడ్డారు అమితాబ్. టెన్నిస్ లెజెండ్, స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ ఇండియాలో తొలి టెన్నిస్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన సందర్భంగా ఆయన్ను బాలీవుడ్ ప్రముఖులు కలిసారు.

    అమితాబ్ బచ్చన్, లారా దత్తా, ఐపిటిఎల్ ఫౌండర్స్ రానా దగ్గుబాటి, దీపిక పదుకోన్, అమీర్ ఖాన్, అక్షయ్ కపూర్ తదితరులు రోజర్ ఫెడరర్ తో కలిసి గడిపారు. ఆయతో టెన్నిస్ ఆడారు. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకో కలిసి ఈ టెన్నిస్ స్టార్‌కు బాలీవుడ్ డాన్స్ పాఠాలు నేర్చడం విశేషం.

     Deepika Padukone and Amitabh Bachchan give dancing lessons to Roger Federer

    టెన్నిస్‌ దిగ్గజం, రారాజు రోజర్‌ ఫెడరర్‌ ఇండియాలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తనదైన మార్క్‌ను చాటాడు. స్లామర్స్‌పై చెలరేగి తన కోసం స్టేడియానికి వేలాదిగా తరలివచ్చిన ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకున్నాడు. ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ లీగ్‌, ఉపఖండంలో తొలి మ్యాచ్‌ ఆడిన ఫెడరర్‌..విజయంతో ఆరంభించాడు. లీగ్‌లో భాగంగా భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ప్లేయర్స్‌ సానియా మిర్జా, రోహన్‌ బొపన్నలతో జట్టు కట్టిన స్విస్‌ యోధుడు స్థానికి అభిమానులను మైమరిపించాడు. స్విస్‌ స్టార్‌ నామస్మరణతో న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ ఇండోర్‌ స్టేడియం మార్మోగింది.

    English summary
    Deepika Padukone and Amitabh Bachchan give dancing lessons to Roger Federer. They say there are two religions in India - Cricket and Bollywood. Looks like Tennis could soon be added to that list. Megastar Amitabh Bachchan had flown to the national capital to watch the Swiss Great, Roger Federer play the first match in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X