» 

మహేష్ ని కాదంది కానీ...

Deepika Padukone
మహేష్ వరుడు చిత్రం కోసం స్టార్ హీరోయిన్ దీపికా పడుకోనే ని వీరలెవెల్లో ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె మరో తెలుగు చిత్రంలో కనపడనుంది. స్వీయ నిర్మాణంలో దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ రూపొందిస్తున్న 'లవ్‌ 4 ఎవర్‌' చిత్రంలో ఆమె ఓ ఐటం సాంగ్ లో చేస్తోంది.

ఇదివరలో 'ప్రేమించుకుందాం రా' చిత్రంతో అంజలా ఝవేరి, 'ప్రేమంటే ఇదేరా'తో ప్రీతీ జింటా, 'టక్కరి దొంగ'తో బిపాసా బసు, లీసారే లను తెలుగు తెరకు పరిచయంచేసి, 'రావోయి చందమామ'లో ఐశ్వర్యారాయ్‌ తో ప్రత్యేక పాట చేయించిన జయంత్‌ ఈసారి దీపికను తెలుగు తెరకు పరిచయం చేస్తుండటం విశేషం. 'ఓం శాంతి ఓం'తో పరిచయమై తొలి చిత్రంతోటే టాప్‌ హీరోయిన్ గా మారిన దీపిక ఇప్పటికే తెలుగులో చాలా మందికి నో చెప్పింది. అయితే ఆ పని జయంత్‌ కు మాత్రం ఆమె చేయలేకపోయింది.

ఆమెపై ఈ నెల 24 నుంచి వారం రోజులపాటు ఆ ప్రత్యేక పాటను చిత్రీకరించనున్నట్లు, ఆ పాట చిత్రానికి హైలైట్‌ అవనున్నట్లు జయంత్‌ తెలిపారు. నూతన తారలు రణదీప్‌, మృదుల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అన్విత, జయంత్‌, మాటలు: రాజసింహ, సంగీతం: రామ్‌ సంపత్‌, సినిమాటోగ్రఫీ: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, కళ: కృష్ణమాయ, సహ నిర్మాత: సుమంత్‌ సి. పరాన్జీ.

Read more about: deepika padukone, mahesh babu, varudu, jayant, love 4 ever, aishwarya ai, ram sampanth, మహేష్, వరుడు, దీపికా పడుకోనే, జయంత్‌ సిపరాన్జీ, లవ్‌ 4 ఎవర్, ఐటం సాంగ్

Telugu Photos

Go to : More Photos