twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రి..కూతురు మధ్యలో మరొకడు (దీపికా 'పీకూ' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలీవుడ్ రూపు రేఖలు మారుతున్నాయి. కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తోంది. ముఖ్యంగా స్టార్స్ సైతం ఇటువంటి చిత్రాల్లో నటించటానికి ఆసక్తి చూపుతూండటంతో ఇలాంటి సినిమాలు ఊపందుకున్నాయి. రొటీన్ పాట,ఫైట్, పెళ్లి వంటి అంశాలు కాకుండా కాస్త భారితనం తగ్గించి నిండైన స్క్రిప్టుతో రెడీ అయిన స్రిప్టులు ఇప్పుడు బాలీవుడ్ ని పలకరిస్తున్నయి. అలాంటి చిత్రం ఒకటి బాలీవుడ్ లో ఈ రోజు రిలీజ్ అవుతోంది. అది మరేదో కాదు 'పీకూ'.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇంతకీ ఈ 'పీకూ' ఎవరూ అంటే...మనకు రెగ్యులర్ గా కనిపించే అమ్మాయే. ఓ చేతిలో ఆఫీసు ఫైళ్లు, మరో చేతిలో ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు... ఇదీ సాయంత్రమైతే పీకూ గెటప్. ఉదయమంతా పని చేసి సాయంత్రమయ్యేసరికి ఇంట్లో పనులు చూడాలి. దిల్లీ మహానగరంలో ఆర్కిటెక్ట్‌గా పని చేస్తూ తన తండ్రితో జీవిస్తుంటుంది పీకూ. ఎవరినైనా ఎదిరించి అవసరమైతే నాలుగు దెబ్బలేయగల ధైర్యం ఉన్న అమ్మాయి.

    Deepika's ‘Piku’ movie preview

    తండ్రి భాస్కర్‌ చౌదరి అలియాస్‌ బాబా అంటే చాలా ప్రేమ. వయసుపైబడిన తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. బాబా దగ్గరికొచ్చేసరికే అసలు మజా మొదలవుతుంది. ఆయనకు చాదస్తంతోపాటు చెవుడూ ఉంది. ఆ రెండింటితో పీకూను తెగ విసిగిస్తాడు. దీన్ని పీకూ సరదాగా తీసుకొన్నా ఒక్కోసారి నాన్న మీద గయ్యిమంటుంది. అయినా పీకూనే బాబాకి బెస్ట్‌ డాటర్‌... బాబానే పీకూకి బెస్ట్‌ ఫాదర్‌. అలాంటి వీరిద్దరూ దిల్లీ నుంచి సొంత ప్రాంతం కోల్‌కతాకు ప్రయాణం కడతారు ఈ సమయంలోనే వీరికి రాణా కలుస్తాడు. అసలీ రాణా ఎవరు? పీకూ, బాబాల ప్రయాణం ఎలా సాగిందో నేడు విడుదలవుతున్న 'పీకూ'లో చూడాలి.

    అమితాబ్, దీపికా పీకూగా ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.తండ్రి-కూతురు అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఫ్యామిలీ డ్రామా కామెడీ ఎంటర్ టైనర్ లో దీపికా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. అమితాబ్, ఇర్ఫాన్ ఖాన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో బెంగాలీ యువతిగా నటిస్తున్న దీపికా పాత్ర సహజత్వం కోసం బెంగాలీ భాష నేర్చుకుంది.

    దర్శకుడు సూజిత్‌ సర్కార్ మాట్లాడుతూ....‌''తండ్రీ కూతుళ్ల మధ్య బంధాన్ని వివరిస్తూ గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఇదీ ఆ అంశం మీద నడిచే సినిమానే. అయితే కొంచెంసేపు నవ్వించి కాసేపు కంటతడిపెట్టించి... జీవితమంటే ఏంటో చూపించే సినిమా ఇది. పీకూ, బాబాలాంటి వాళ్లు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటివారి కథే ఈ సినిమా. తండ్రీ కూతుళ్ల బంధాన్ని నా శైలిలో ఆవిష్కరించా'' అన్నారు.

    Deepika's ‘Piku’ movie preview

    చిత్రం విశేషాల్లోకి వెళితే...

    తొలి పోస్టరు, టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బానపొట్ట, పెద్ద కళ్లజోడుతో ఆ పోస్టరులో అమితాబ్‌ కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకొంది. ఆ తర్వాత హావ్‌డా వంతెన సమీపంలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ సైకిల్‌ తొక్కుతున్న ఫొటో ఆన్‌లైన్‌లో సందడి చేసింది. దానికీ మంచి స్పందనే వచ్చింది.

    అలాగే...ఈ సినిమా కోసం దీపికా పదుకొణె బెంగాళీ నేర్చుకొంది. ఆధునిక యువతిగా కనిపించడానికి దీపిక పెద్ద కసరత్తులే చేసింది. అమితాబ్‌, ఇర్ఫాన్‌లాంటి మేటి నటుల మధ్య దీపిక చక్కటి నటన ప్రదర్శించిందని చిత్రం యూనిట్ చెబుతోంది. తన కెరీర్‌లో పోషించిన పాత్రల్లో ఇది చాలా వైవిధ్యమైంది.. ఇష్టమైందన్నాడు ఇర్ఫాన్‌ ఖాన్‌.

    ఇక బాలీవుడ్‌ తారల కోసం సినిమాను బుధవారం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత పలువురు తారల సందేశాలతో 'పీకూ' ట్విట్టర్‌ పేజీ నిండిపోయింది. అమితాబ్‌, దీపిక, ఇర్ఫాన్‌లను మెచ్చుకుంటూ అందరూ ట్వీట్లు చేస్తున్నారు.

    అంతేకాదు... ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన నటీనటుల్లో కత్రినా కైఫ్‌, కంగనా రనౌత్‌ కూడా ఉన్నారు. రణ్‌బీర్‌ ప్రేమ వ్యవహారం తర్వాత కత్రినా కైఫ్‌, దీపిక మధ్య సత్సంబంధాలు లేవు. అలాగే 'క్వీన్‌' తర్వాత కంగన, దీపిక మధ్య జరిగిన మాటల పోరు వల్ల వీరిద్దరి మధ్య అపోహలు కలిగాయి. ఇప్పుడు ఈ కార్యక్రమంతో నాటి సమస్యలు ముగిశాయంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

    దీపికా మాట్లాడుతూ చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నేను తమిళ యువతిగా నటించాను. రామ్‌లీలాలో గుజరాతీ మహిళగా, హ్యాపీ న్యూఇయర్‌లో మహారాష్ట్ర యువతిగా నటించాను. నాకు గుజరాతీ, మరాఠి భాషలపై కొంత పట్టుంది. అందుకే ఆ సినిమాల సమయంలో భాష నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా చేసినప్పుడు తమిళం నేర్చుకున్నాను.

    అదే విధంగా పీకూ చిత్రం కోసం బెంగాలీ నేర్చుకుంటున్నాను. కొత్త భాషను నేర్చుకోవడం సవాలులాంటిది. కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా స్థానిక బెంగాలీ వాళ్లతో మాట్లాడటం వల్ల త్వరగా భాషను నేర్చుకోవచ్చు. బెంగాలీ భాషలో పర్‌ఫెక్షన్ సాధిస్తాననే నమ్మకముంది అని చెప్పింది.

    ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ కూడా పొడవాటి జుట్టు, పెద్ద పొట్టతో డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, ఇర్ఫాన్‌ ఖాన్‌, మౌసమీ ఛటర్జీ ముఖ్య పాత్రధారులు. 'విక్కీ డోనర్‌', 'మద్రాస్‌ కేఫ్‌' వంటి చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరుగాంచిన సూజిత్‌ సర్కార్‌ ఈ చిత్ర దర్శకుడు.

    English summary
    ‘Piku’ takes you on a journey with her pesky and cranky old father on the streets of Kolkatta, in this one of a kind family drama. A quirky, comic father-daughter story, the film derives its title from Satyajit Ray’s short film Pikoo’s Diary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X