twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేస్ బుక్ లో జయప్రద అసభ్య చిత్రాలు..కంప్లైంట్

    By Srikanya
    |

    న్యూఢిల్లీ : ఫేస్ బుక్ అనేక సమస్యలుకు మూలంగా మారుతోంది. ఈ సమస్యలనుంచి ప్రముఖులు కూడా తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా నటి, రాజకీయవేత్త జయప్రదకు తాజాగా ఒక చిక్కువచ్చిపడింది. ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ (తల జయప్రదను సూచించగా మిగతా శరీరం వేరే అసభ్యభంగిమను చూపిస్తుంది. ఇది ఫొటోషాప్‌తో చేసి ఒక వెబ్‌సైట్లో పెట్టారని లింకు తీసుకువచ్చి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు ఇచ్చారని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    రాజ్యసభ ఎంపి అమర్‌సింగ్‌తో కలసివచ్చి ఆమె పోలీసు శాఖలోని ఆర్ధికనేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి ఈ ఫొటోలను అప్‌లోడ్‌ చేశారని ఆమె ఆరోపించారు. దాంతో పలువురు ఆ కృత్రిమంగా సృష్టించిన అసభ్య ఫొటోలను వీక్షించారని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.

    ఇదిలా ఉంటే జయప్రధ నిర్మాతగా మారి ఓ రీమేక్ చిత్రం అందించనున్నారు. ఆ రీమేక్ మరేదో కాదు..తెలుగులో సూపర్ హిట్ అయిన 'మాతృదేవోభవ'. అయితే ఈ చిత్రాన్ని ఆమె భోజపురి భాషలో నిర్మిస్తూ కీ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమాను జయప్రద భోజ్‌పురిలో చేస్తున్నారు. ఆమె సరసన భోజ్‌పురి సూపర్‌స్టార్ మనోజ్ తివారి నటిస్తున్నారు. కేడీ దర్శకత్వంలో స్టూడియో 9 ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    ఇక ఇటీవల కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలు చేసిన ప్రస్తుతం భోజ్‌పురి భాషలో ఆమె ఒక చిత్రంలో నటించబోతున్నారు. తెలుగు తెరపై కన్నీటి వర్షాన్ని కురిపించిన 'మాతృదేవోభవ'కు రీమేక్ ఇది. అమ్మా నాన్న.. నలుగురు పిల్లలలు చుట్టూ సాగే కథ ఇది. తండ్రి హత్యకు గురవుతాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తల్లిని కేన్సర్ మహమ్మారి ఆక్రమిస్తుంది. చనిపోయేలోపు నలుగురు పిల్లలను దత్తత ఇవ్వడానికి ఆ తల్లి పడే ఆరాటం అందరి కంట తడిపెట్టించింది.

    దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచినా 'మాతృదేవోభవ' చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...' పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అంతగా ప్రేక్షకుల్ని హత్తుకున్న ఈ చిత్రంలో మాధవి అద్భుతంగా చేసిన పాత్రను జయప్రద చేయబోతున్నారు. నాజర్ పాత్రను భోజ్‌పురిలో ప్రముఖ నటుడైన మనోజ్ తివారీ చేయబోతున్నారు. దినకర్ కపూర్ దర్శకత్వంలో జయప్రద నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ఆరంభం కానుంది. ఇది కాకుండా భవిష్యత్తులో జయప్రద మరిన్ని చిత్రాలు నిర్మించాలనుకుంటున్నారు. అందుకని ముంబయ్‌లోని జుహూలో ఆఫీస్ ఆరంభించారని, గుర్గావ్‌లో ఇల్లు తీసుకున్నారని సమాచారం.

    English summary
    
 The Delhi Police is investigating the source of some "morphed pictures" of Samajwadi Party MP from Rampur and former actor Jayaprada after she complained that some objectionable photographs had been put up on a website and the link posted on her Facebook account. Sources said Jaya Prada, along with Rajya Sabha member Amar Singh, approached the Economic Offences Wing on Monday and complained about the pictures. "She claimed that her account had been hacked and her pictures uploaded," an officialsaid. Subsequently, the Facebook profile had been viewed by many visitors and obscene messages posted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X