twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆటోనగర్ సూర్య’ రిలీజ్ పై దేవ కట్టా ట్వీట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా రూపొందుతూ ఆగిపోయిన చిత్రం ఆటో నగర్ సూర్య. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దేవాకట్ట.... తన ట్విట్టర్లో చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం విషయంలో అంతరాయం తలెత్తిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని త్వరలోనే అన్ని పూర్తి చేసి రిలీజ్ చేస్తానని ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తిగావచ్చిందని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని దేవా కట్టా ట్విట్టర్‌లో తెలిపారు. 'ఆటోనగర్ సూర్య చివరి దశ పనులు త్వరలోనే మోదలవుతాయి. చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత నేను ఇదివరకూ ట్విట్టర్ లో వేస్తున్న ట్వీట్స్ తీసేస్తున్నాను' దేవకట్టా ట్వీట్ చేసాడు.

    ఇక నాగచైతన్య 'తడాఖా' చిత్రం తో ప్లాప్ ల నుంచి రిలీఫ్ అయ్యారు. ఆయన చిత్రం అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సమంత కు సైతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పూర్తి చేసి విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య తాతయ్య, తండ్రితో కలిసి 'మనం'లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. ఈ చిత్రానికి సంభందించి రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు 'ఆటోనగర్‌ సూర్య' చిత్రంలో చూపించబోతున్నారు.

    ఆటో నగర్ సూర్య చిత్రంలో సమంత హీరోయిన్. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈ చిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

    English summary
    
 Devakatta tweeted: ANS finishing wrk to strt soon. Aftr knowing more details, I wud like discard some of the comments posted a while bck on twitter :)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X