twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవిశ్రీ ప్రసాద్ రూపంలో ‘వినాయకుడు’.... సిగ్గు చేటు అంటూ విమర్శలు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసినా సందడే సందడి. ఊరూరా.. వాడ వాడలా కొలువుదీరిన వినాయక మండపాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తేడాల లేకుండా భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు.

    ప్రతిసారి వినాయక ఉత్సవాల సందర్భంగా... సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఏదో ఒక రకంగా వివాదానికి గురవుతున్న సంగతి తెలిసిందే. గతంలో వినాయక చవితి సందర్భంగా బాహుబలి, గబ్బర్ సింగ్, ఈగ సినిమా లాంటి రూపాల్లో వినాయక విగ్రహాలను చూసాం... అప్పట్లో వాటిపై కొందరు విమర్శలు చేసారు కూడా.

    తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.... రూపంలో వినాయకుడిని పెట్టడం వివాదాస్పదం అయింది. పైగా తన రూపంతో విగ్రహం పెట్టిన విషయాన్ని దేవిశ్రీ తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేసి సంబరపడిపోవడంపై మండిపడుతున్నారు కొందరు.

    ఈ విషయంలో కొందరు దేవిశ్రీ అభిమానులు మద్దతు ఇస్తుంటే.... మరికొందరు ఇలాంటి విగ్రహం పెట్టడం ఏమిటీ అంటూ విమర్శిస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద బేట్ జరుగుతోంది.

    అవమాన పరచొద్దు

    అవమాన పరచొద్దు

    దేవి శ్రీ ప్రసాద్ గొప్పవాడే, కానీ గణేషుడు ఇంకా గొప్పవాడు. నిజంగా దేవి శ్రీ మీద అంతా ప్రేమ ఉంటే.. తన పేరు తో పదిమందికి మంచి చేయండి.. మంచి పనులు చేయండి.. అంతేకాని ఇలా గణేశుడిని అవమాన పరిచే పనులు చేయొద్దు అంటూ....దేవిశ్రీ ప్రసాద్ పెట్టిన పోస్టుకు కామెంట్స్ వచ్చాయి.

    అప్పుడు మీకు తప్పు అనిపించలేదా?

    అప్పుడు మీకు తప్పు అనిపించలేదా?

    అప్పట్లో బాహుబలి, గబ్బర్ సింగ్ వినాయకుడు పెట్టినపుడు మీకు తప్పు అనిపించలేదా? ఇపుడు మా దేవిశ్రీ ప్రసాద్ రూపంలో పెడితే మీకు తప్పుగా అనిపిస్తోందా? అంటూ ఆయన అభిమానులు సమర్థిస్తున్నారు.

    యువత తిక్క దారిపడుతోంది

    యువత తిక్క దారిపడుతోంది

    సంస్కృతి,సాంప్రదాయాల రూపాల విషయాలలో ప్రయోగాలు చేయకండి. యువత తిక్క దారిన పడుతుంది సోదరా! అంటూ.....మరో విమర్శ.

    సిగ్గుచేటు

    సిగ్గుచేటు

    అయితే ఈ చర్యను కొందరు దేవిశ్రీ అభిమానులు సమర్ధించుకోవడంపై సైతం విమర్శలు వచ్చాయి. ఇలాంటి వాటిని సమర్ధించడం సిగ్గు చేటు అంటూ మండి పడుతున్నారు మరికొందరు.

    బాహుబలి వినాయకుడు

    బాహుబలి వినాయకుడు

    అప్పట్లో బాహుబలి వినాయకుడు రూపంలో విగ్రహ ప్రతిష్టాపన చేసారు. అయితే అందులో వ్యక్తులను దేవుడి రూపంలో మాత్రం చూపలేదు. కేవలం కాన్సెప్టును తీసుకున్నారు.

    గబ్బర్ సింగ్, ఈగ వినాయకా

    గబ్బర్ సింగ్, ఈగ వినాయకా

    అప్పట్లో కొందరు గబ్బర్ సింగ్ వినాయకుడి రూపాన్ని కూడా ప్రతిష్టించారు. అప్పుడు ఇలానే విమర్శలు వచ్చాయి.

    కామెంట్ ప్లీజ్

    కామెంట్ ప్లీజ్

    మరి ఇలాంటి పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? అనేది క్రింద కామెంట్ బాక్సులో వెల్లడించండి.

    English summary
    Devi Sri Prasad's Ganesh idol Controversy Viral on Facebook and Social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X