»   » హాట్ న్యూస్ :'దేవుడు చేసిన మనుషులు'రిలీజ్ డేట్ మళ్లీ మారింది

హాట్ న్యూస్ :'దేవుడు చేసిన మనుషులు'రిలీజ్ డేట్ మళ్లీ మారింది

Posted by:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్,రవితేజ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం విడుదల తేదీని జూలై 27 నుంచి ఆగస్టు 8 అని నిర్మాతలు ప్రకటించారు. ఈ లోగా మళ్లీ విడుదల తేదీని మార్చారు. ఈ సారి ఆగస్టు 3న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జులాయి చిత్రం కూడా ఆగస్టు 9న విడుదల ప్రకటించటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. జులాయి చిత్రం భారీ ఎత్తున ఎక్కువ ధియోటర్స్ లో విడుదల కానుండటంతో ధియోటర్స్ సమస్య వస్తుందని ఈ డెషిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు.

'దేవుడు చేసిన మనుషులు'ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా గురించి ఆయన తెలియజేస్తూ "ఇటీవల విడుదలైన ఆడియో సూపర్ హిట్టయింది. సినిమా విడుదలకు ముందే అన్ని పాటలూ ఆదరణ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ తెలుపుతూ...పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయట. మరి ప్రేమ పుట్టుక కూడా అక్కడే జరుగుతుందా? ఎవరు ఎవరిని ప్రేమించాలో దేవుడే నిర్ణయిస్తాడా? ప్రేమ అనే కాదు... ఈ సృష్టిలోని సమస్త విషయాలకూ బీజం భగవంతుడే వేస్తాడు. దేవుడికి అదో ఆట. ఈసారి ఆయనకు మరో ఇద్దరు దొరికారు... ఏదో మాయ చేసి వారిద్దరి మధ్య ప్రేమ సృష్టించాడు. మరి ఆ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలి అన్నారు.


సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ "పాటల్ని ఇంత పెద్ద హిట్‌చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. పూరి జగన్నాథ్‌తో చేస్తున్న ఈ సినిమా నా కెరీర్‌కి ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతి రాణా, మానస, గాబ్రియేల్ బర్తాంతే తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఫైట్స్: విజయ్, డాన్స్: ప్రదీప్ ఆంథోని, దినేశ్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

English summary
Producer BVSN Prasad announced postponement of Devudu Chesina Manushulu from July 27th to August 8th. Now, we came to know that the release date has now been advanced to August 3rd from August. Puri Jagannath has directed the movie, which is produced by BVSN Prasad. Ileana is playing the female lead in the film. Raghu Kunche has composed the music for the movie.
Please Wait while comments are loading...