twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ హీరో అభిమానులని కూడా చూడం.., బాలయ్య చిరు అభిమానులకి డీజీపీ వార్నింగ్

    అభిమానులెవరైనా హద్దులు దాటితే కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనకాడబోమని బాలయ్య చిరు అభిమానులకి డీజీపీ వార్నింగ్ ఇచ్చారు

    |

    హీరోలు ఇద్దరూ ఆల్ ద బెస్ట్‌లు చెప్పుకొంటున్నా.. మెగా అభిమానులు, నందమూరి అభిమానులు మాత్రం నువ్వా..నేనా అన్నట్టు రెండు సినిమాల విడుదల కోసం సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కయ్యానికి కాలు దువ్వినా, ఎలాంటి చిన్న ఘటన జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. రెండు సినిమాల విడుదల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలను చేపట్టింది. సున్నితమైన అంశాలను జాగ్రత్తగా డీల్ చేయాల్సిందిగా పోలీసు సిబ్బంది, సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఏపీ డీజీపీ సాంబశివ రావు ఆదేశాలు జారీ చేశారు.

    'మీరు చిరంజీవిని అభిమానిస్తారో.. బాలకృష్ణను అభిమానిస్తారో మీ ఇష్టం. అందుకు మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎదుటి వారి పోస్టర్లు చించినా, సోషల్‌ మీడియాలో అనుచిత కామెంట్లు పెట్టినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం' అని డీజీపీ సాంబశివరావు... సినీ హీరోల అభిమానులను హెచ్చరించారు. అభిమానం తప్పు కాదు, దురభిమానంతో హద్దు మీరితే అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా విడుదల కానుండటంతో వీరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

    DGP Sambashiva rao's warning to Chiru, Balayya fans

    'సంక్రాంతి మాదే.. మా హీరో సినిమానే హిట్టవుతుంది' అంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారు. దీంతో అక్కడక్కడ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ వ్యవహారంపై డీజీపీ శనివారం విజయవాడలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, రెండు సినిమాలు ఒకే కాంప్లెక్స్‌లో రిలీజవుతుంటే అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

    సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను సైతం పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. ఈ బాధ్యతను సైబర్ క్రైమ్ సిబ్బంది చూసుకుంటారని వెల్లడించారు. అభిమానులెవరైనా హద్దులు దాటితే కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనకాడబోమని, అంతేగాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అభిమానులు వారివారి హద్దులు దాటకుండా ఇద్దరు హీరోల అభిమాన సంఘాలూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

    English summary
    AP DGP Sambasiva Rao has issued a warning or two to the fans not to get too carried away by their heroes and cause any disturbance to public peace. “Enjoy the movies for what they are. Don’t give room for unnecessary controversies. Any one trying to defame any person on social media will be taken to task,” he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X