» 

రామ్ గోపాల్ వర్మ పిటీషన్‌పై స్పందించిన సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి

Posted by:

RGV
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీజనల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఇటీవల నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య-2' చిత్రానికి సెన్సార్ సమయంలో ఇబ్బందులకు గురి చేయడం, అవసరం లేని సన్నివేశాలకు కూడా కోత విధించడం లాంటివి చేయడంతో వర్మ ఈ పిటీషన్ దాఖలు చేసారు.

రామ్ గోపాల్ వర్మ వేసిన పిటీషన్‌పై సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి స్సందించినట్లు తెలుస్తోంది. సినిమాల సెన్సార్ విషయంలో తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని, రివ్యూ కమిటీ సభ్యులంతా కలిసే సెన్సార్ చేస్తామని, వర్మ పిటీషన్ దాఖలు చేసే ముందు రివ్యూ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

సత్య 2 సినిమాలో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించేలా సన్నివేశాలు ఉన్నాయని, ఓ టీవీ ఛానల్ నుండి సెన్సార్ బోర్డుకు మెమోరండం అందిందని, సినిమాలో నుండి తమ సీఈవో పేరు తొలగించాలని వారు కోరినట్లు సమాచారం. వర్మ సినిమాలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లను ఉద్దేశించిన సన్నివేశాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

కాగా...పిటీషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన పలు టీవీ ఛానళ్లలో ఈ విషయమై లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు మద్దతు ప్రకటించారు. వర్మకు మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మోహన్ బాబు కాడా ఉన్నారు. ఇప్పటి వరకు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి గురించి ఎవరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు నిర్మాతలు వాపోయారు.

Read more about: ram gopal varma, satya 2, dhanalakshmi, mohan babu, రామ్ గోపాల్ వర్మ, సత్య 2, ధనలక్ష్మి, మోహన్ బాబు
English summary
The legal petition filed by Ram Gopal Varma against Censor Officer dhanalakshmi for the harassment faced during the issue of Censor Certificate for ‘Satya 2’ developed instant reactions from film industry.
Please Wait while comments are loading...