»   » పవన్ కళ్యాణే అంటూ ప్రచారం... వేడుక క్యాన్సిల్ చేసిన రామ్ చరణ్!

పవన్ కళ్యాణే అంటూ ప్రచారం... వేడుక క్యాన్సిల్ చేసిన రామ్ చరణ్!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ 'ధృవ'. గీతాఆర్ట్స్ వారు రామ్ చరణ్ తో మగధీర తర్వాత చేస్తున్న మూవీ ఇది.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు. అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.


న‌వంబ‌ర్ మొద‌టివారంలో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ పూర్త‌వుతుంది. ఒక పాట మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంటుంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబ‌ర్‌ 2న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


ఈ మూవీ ఆడియో వేడుక విషయంలో రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది.


ఆడియో వేడక రద్దు చేసాడు

ధృవ సినిమాకు ఆడియో వేడుక చేయడం లేదని, నవంబర్ 9న పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు రామ్ చరణ్ ప్రకటించారు. సినిమా ప్రచారంలో కీలక భూమిక పోషించే ఆడియో వేడుకను రద్దు చేయడం హాట్ టాపిక్ అయింది.


పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం

ధృవ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తాడంటూ కొంతకాలంగా మీడియాలో, వెబ్ సైట్లలో ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో రామ్ చరణ్ ఆడియో వేడుకను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.


అసలు విషయం ఇది

పవన్ కళ్యాణ్ కు, ధృవ ఆడియో వేడుక రద్దు కావడానికి ఎలాంటి సంబంధం లేదని, రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ పోస్టు ప్రొడక్షన్ పనులతో పాటు, తాను నిర్మిస్తున్న ‘ఖైదీ నెం 150' సినిమాకు సంబందించిన ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ధృవ ఆడియో వేడుక రద్దు చేసారని ఆయన సన్నిహితులు అంటున్నాు.


ఆడియో వేడుక బదులు ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆడియో వేడుక లేక పోయినా...సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు విజయవాడలో నిర్వహిస్తారని, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు హాజరవుతారని సమాచారం.


రామ్ చరణ్ మూవీ సెట్లో చిరంజీవి

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ తమిళా (ఆది), ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.


ఏం చేసాడో తెలుసా? రామ్ చరణ్.... నీది నిజంగా చాలా పెద్దమనసు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి వారసత్వాన్ని వందకు వంద శాతం పునికి పుచ్చుకున్నారు. కేవలం ఆయన నుండి నట వారసత్వాన్నే కాకుండా.... ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


చెర్రీకి సెట్ కావనే విమర్శలు

విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Mega Power Star Ram Charan's most awaited film Dhruva production team has decided to release the audio into market directly without an audio launch event planned.
Please Wait while comments are loading...