»   » అంతా ఈ నోట్ల రద్దు వల్లే.... ‘ధృవ’ లేటు కావడంపై అల్లు అరవింద్!

అంతా ఈ నోట్ల రద్దు వల్లే.... ‘ధృవ’ లేటు కావడంపై అల్లు అరవింద్!

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ‌ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ‌ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

ఈ నోట్ల రద్దు వల్ల సినిమా విడుదల సమస్యగా మారిందని, అందుకే సినిమాను అనకున్న సమయానికి విడుదల చేయకుండా కాస్త లేటుగా రిలీజ్ చేస్తున్నామనే విధంగా ఆయన కామెంట్ చేయడం గమనార్హం.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ట్రైల‌ర్‌ను భారీగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. అలాగే సినిమాను ముందు డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని అనుకున్నా, డిమాంటైజేష‌న్(నోట్ల రద్దు ఇష్యూ) కార‌ణంగా సినిమాను డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామని తెలిపారు.

డిసెంబర్ 4న గ్రాండ్ ఫంక్షన్

సినిమా విడుద‌ల లోపు అంటే డిసెంబ‌ర్ 4న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హిస్తున్నాం. అలాగే వైజాగ్‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి ప్రాంతాల్లో సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లేలా అక్కడ పలు ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు అరవింద్.

భారీగా ప్రీమియర్

ధృవ మూవీ ప్రీమియ‌ర్ అమెరికాలోని న్యూజెర్సీ, శాన్‌ఫ్రాన్సిస్కో స‌హా మ‌రో ప్రాంతంలో నిర్వ‌హించాల‌నుకుంటున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.

పెద్ద హిట్టఅవుతుంది

సినిమాకు మరో నిర్మాతగా ఉన్న ఎన్‌.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ - `` మెగాఫ్యాన్స్ చ‌ర‌ణ్ నుండి ఎలాంటి హిట్ కావాల‌ని కోర‌కుంటున్నారో దాని కంటే నాలుగు రెట్లు పెద్ద హిట్ వ‌స్తుంది. అంత అద్భుత‌మైన చిత్రం ఇది`` అన్నారు.

చరణ్ కష్టపడ్డాడు

సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - `ఈ సినిమా కోసం అందరి కంటే ఎక్కువ కష్టపడింది హీరో రామ్ చరణే. అతని కష్టం థియేట్రైల‌ర్‌లో క‌న‌ప‌డుతుంది. సినిమా ప్రతి ఒక్క మెగా అభిమాని మెప్పిస్తుంది అన్నారు.

రకుల్

ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ``నాకు స్పెష‌ల్ మూవీ. చ‌ర‌ణ్‌, సురేంద‌ర్‌రెడ్డిగారు, అల్లు అర‌వింద్‌గారితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. మంచి సినిమాలో భాగ‌మైనంద‌కు ఆనందంగా ఉంది`` అన్నారు.

ధృవ

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ త‌మిళ , ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

English summary
Dhruva Movie Trailer Launch held at Prasad Labs in Hyderabad friday (25th Nov) evening.
Please Wait while comments are loading...