twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణం పోసే ఆయుధమే గొప్పది: బాలయ్య స్పీచ్ (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రాణం తీసే భయం కన్నా...ప్రాణం పోసే ఆయుధం గొప్పది...ఆ వెపనే నా క్యారెక్టర్..అదే డిక్టేటర్ అంటూ బాలయ్య తన తాజా సినిమా ‘డిక్టేటర్' గురించి చెప్పుకొచ్చారు. ఈ చిత్రం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ చిత్రానికి లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

    బాలయ్య ‘డిక్టేటర్' ప్రారంభోత్సవం (ఫోటోస్)బాలయ్య ‘డిక్టేటర్' ప్రారంభోత్సవం (ఫోటోస్)


    కథ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ కొత్తదనాన్ని ఫీలవుతున్నాను. ఈ మధ్యే ఈరోస్ ప్రతినిధి సునీల్ లుల్లా, డైరెక్టర్ శ్రీవాస్ కలిసి మాట్లాడుకున్నాం. కోన వెంకట్, గోపీ మోహన్ అన్ని ఎలివెంట్స్ ఉన్న మంచి కథ అందించారు. రత్నం, శ్రీధర్ సీపానలు కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారని బాలయ్య తెలిపారు.

    Dictator Movie launch: Balakrishna's Speech

    ఈ సినిమాకు ఒక ఫ్రెష్ టీంతో కలిసి పని చేస్తున్నాను. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్టెన్మెంట్ అన్ని ఎలిమెంట్స్ తో యూనిక్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని బాలయ్య తెలిపారు.

    ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య, అంజలిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేయగా.... బోయపాటి శ్రీను క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి గోపాల్, సురేష్ బాబు, అంబిక కృష్ణ, సురేష్ బాబు, కోన వెంకట్, గోపీ మోహన్, సత్యదేవ్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఆర్.పి.పట్నాయక్, ధశరత్, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు.

    English summary
    Actor Balakrishna, during the launch of the 99th movie 'Dictator' at Ramanaidu studio, assured that the movie will be appreciated by everyone as the story is very good. He has highlighted the calibre of the director Sriwas and said that he felt happy to do a film with him. Further, he said that Sriwas will team up with Eros International to produce the film and star writers Gopi Mohan and Kona Venkat have penned the story and screenplay.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X