»   » ఆ సినిమా చూసి స్పెల్‌బౌండ్‌ అయ్యాను: దిల్‌రాజు

ఆ సినిమా చూసి స్పెల్‌బౌండ్‌ అయ్యాను: దిల్‌రాజు

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రొడ్యూసర్‌గానే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్‌రాజు ‘పట్టిందల్లా బంగారమే' అన్న పేరుంది. ఇటీవకాలంలో ‘గోల్డెన్‌ రాజు'గానూ వ్యవహరించబడుతున్న దిల్‌రాజు తాజాగా ‘బాహుబలి' చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేయడం, ఆ చిత్రం తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రను తిరగరాయడం సైతం తెలిసిందే.

 Dil Raju Bought the Nizam Rights of

తాజాగా దిల్ రాజు ‘సినిమా చూపిస్త మావ' చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాలు ఫ్యాన్సీ ఆఫర్లతో బిజినెస్‌ జరుపుకొని, అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న ‘సినిమా చూపిస్త మావ' చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కు దిల్‌రాజు సొంతం కావడంతో ఈ సినిమాపై గల క్రేజ్‌ మరింత పెరుగుతోంది.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ... ‘‘బాహుబలి' వంటి మెగా బ్లాక్‌బస్టర్‌ తర్వాత నైజాంలో మేం డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న సినిమా ‘సినిమా చూపిస్త మావ'. ఈ సినిమా గురించి గత కొన్ని వారాలుగా వింటూనే ఉన్నాను. దాంతో సినిమా చూపించమని నిర్మాతలను అడిగితే సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్‌ నాకు సినిమా చూపించారు. వాళ్లూ వీళ్లూ చెప్పిన మాట ద్వారా` ‘సినిమా చూపిస్త మావ' చిత్రంపై కొంత ఎక్స్‌పెక్టేషన్‌తో సినిమా చూసిన నేను.. సినిమా చూసి స్పెల్‌బౌండ్‌ అయిపోయాను.

 Dil Raju Bought the Nizam Rights of

ఇటీవకాంలో ఓ చిన్న సినిమా ఇంత వండర్‌ఫుల్‌గా రావడం జరగలేదు. వెంటనే మా శిరీష్‌ను కూడా చూడమని చెప్పాను. తనకి కూడా విపరీతంగా నచ్చేసింది. సెకండ్‌ ధాట్‌ లేకుండా.. ప్రొడ్యూసర్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న మొత్తానికి.. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ తీసుకొన్నాను. ఈ సందర్భంగా ‘సినిమా చూపిస్త మావ' నిర్మాతతోపాటు డైరెక్టర్‌ త్రినాధరావు నక్కిన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌చంద్ర, డైలాగ్‌ రైటర్‌ ప్రసన్నకుమార్‌ తదితరును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజ్‌తరుణ్-అవికాగోర్‌ నటించిన ‘ఉయ్యాల జంపాల' కంటే.. వాళ్లిద్దరూ రెండోసారి కలిసి నటించిన ‘సినిమా చూపిస్త మావ' మరింత పెద్ద విజయం సాధించడం ఖాయం' అన్నారు.

అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌-ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)-రూపేష్‌ డి.గోహల్‌-జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సినిమా చూపిస్త మావ' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే!!

English summary
Tollywood producer Dil Raju Bought the Nizam Rights of "Cinema Chupista Maava".
Please Wait while comments are loading...