twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ విషయంలో వీడేంట్రా హీరో అన్నారు: సినీ వారసులపై దిల్ రాజు స్పందన!

    By Bojja Kumar
    |

    సినీ రంగంలో వారసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు ఎక్కువగా కొత్తవాళ్లు, తక్కువగా వారసులు ఉండేవారు. కానీ ఇపుడు సినిమా రంగానికి చెందిన స్టార్స్ వారసుల హవా కొనసాగుతోంది. బలవంతంగా కొడుకులను, మనవళ్లను ప్రేక్షకులపై రుద్దుతున్నారనే వాదన కూడా ఉంది. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ తనదైన రీతిలో స్పందించారు.

    దీనిపై దిల్ రాజు స్పందిస్తూ... మా ఫ్యామిలీలో నేను ముందు సినిమా రంగంలోకి వచ్చాను. సక్సెస్ అయ్యాను. దీని తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని మంచి వ్యాపారంగా భావించి ఇటువైపు వస్తున్నారు. వారసులుగా వస్తున్న హీరోలకు ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్ అప్పటికే వారి ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉండటమే. వారు ఫస్ట్ డే వెళతారు. వాళ్ల దగ్గర టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటేనే వారు వారు సక్సెస్ అవుతారు. తర్వాత హీరోల కొడుకులు కదా... హీరోల మనవళ్లుకదా ఎవరూ చూడరు, వాళ్ల టాలెంటును చూసే వస్తారు అని దిల్ రాజు అభిప్రాయ పడ్డారు.

     అల్లు అర్జున్ గురించి

    అల్లు అర్జున్ గురించి

    బన్నీ విషయమే... తీసుకుంటే బన్నీతో నాకు ఎంతో ఇంటరాక్షన్ ఉంది, గంగోత్రి సినిమాలో ఈయన హీరో ఏంటి? నేనైనా ఇంత రెస్పెక్టుగా మాట్లాడుతున్నాను..... ఆడియన్స్ అయితే వీడేంట్రా హీరో అన్నారు. కానీ ఆర్య సినిమా తర్వాత ఏమైంది? ఆ మూవీ ఓ మ్యాజిక్. తనను తాను మార్చుకున్నాడు. ఆర్య కోసం తను ఎంత హార్డ్ వర్క్ చేసాడో నాకు తెలుసు. స్టెప్ బై స్టెప్ జీరో నుండి ఓ స్టార్ ఇమేజ్ తెచ్చేసుకున్నాడు అని దిల్ రాజు అన్నారు.

     రామ్ చరణ్

    రామ్ చరణ్

    బన్నీ సక్సెస్ అయినట్లుగా చరణ్ ఎందుకు కాలేకపోతున్నాడు అనే ప్రశ్నకు దిల్ రాజు స్పందిస్తూ....రామ్ చరణ్ ఎదుగుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే సినిమా రంగంలో ఎవరైనా రాణిస్తారు... వారు వారసులా? లేక బయటి వారా? అనే దానితో సంబంధం లేదని దిల్ రాజు అన్నారు.

     చిరంజీవి-రాజమౌళి ‘మగధీర' విబేధాలపై.... దిల్ రాజు స్పందన!

    చిరంజీవి-రాజమౌళి ‘మగధీర' విబేధాలపై.... దిల్ రాజు స్పందన!

    క్లిక్ చేయండి.క్లిక్ చేయండి.

     దిల్ రాజను వాడుకున్నందుకు 2 కోట్లు ముట్టజెప్పారు!

    దిల్ రాజను వాడుకున్నందుకు 2 కోట్లు ముట్టజెప్పారు!

    శివ కార్తికేయన్ నటించిన తమిళ చిత్రం 'రెమో' తెలుగులో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేసారు. థియేటర్స్ నుండి ఆయన బేనర్ వ్యాల్యూ దారా తమకు బాగా ఉపయోగపడుతుందని భావించారట. తెలుగులో పబ్లిసిటీ కోసం రూ. 2 కోట్ల రూపాయలు దిల్ రాజుకు చెల్లించారట.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Dil Raju sensational comments on Allu Arjun acting recent interview. Check out details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X