twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డీజేలో పవన్ కలకలం.. కట్టె కాలేంతవరకు ఆయన ఫ్యాన్‌నే.. ఆ డైలాగ్‌కు పవన్ స్ఫూర్తి.. ఉద్వేగంతో..

    దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడటం ప్రారంభించగానే పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కేకలు వేశారు. ప్రసంగం మధ్యలో నేను పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడుతాను అనగానే హాలంతా కేకలతో హోరెత్తింది.

    By Rajababu
    |

    దువ్వాడ జగన్నాథం ఆడియో వేడుకలో ఊహించిన విధంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు హడావిడి చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడటం ప్రారంభించగానే పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కేకలు వేశారు. ప్రసంగం మధ్యలో నేను పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడుతాను అనగానే హాలంతా కేకలతో హోరెత్తింది. ఆయన గురించి మాట్లాడకపోతే నేనే అసంతృప్తి ఉంటుందని ఫ్యాన్స్‌ను బుజ్జగించారు. పవన్ కల్యాణ్ పేరు వేడుకలో వినిపిస్తున్నప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నవ్వులు చిందిస్తూ కనిపించారు.

    నేను పవన్ ఫ్యాన్‌ను

    నేను పవన్ ఫ్యాన్‌ను

    నేను సినిమా పరిశ్రమకు రాకముందు పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను. నా అభిమాన నటుడితో గబ్బర్ సింగ్‌ లాంటి చిత్రాన్ని ఆయనతో చేశాను. గబ్బర్ సింగ్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఓసారి కలిశాను. ఓ ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపడుదాం అని పవన్ కల్యాణ్ సూచించగా ఓ మాట చెప్పారు. ఆ మాటలను మీరంతా వినాలి.

    సక్సెస్ గురించి మాట్లాడితే..

    సక్సెస్ గురించి మాట్లాడితే..

    హరీష్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. సక్సెస్ రాగానే చాలా మందితో మాట్లాడాలనే ఓ కోరిక కలుగుతుంది. దాంతో సక్సెస్ మనల్ని ఓ చోటు ఉండనివ్వదు. సక్సెస్ మనల్ని ఏదో చేయమని లోలోపల తన్నుతుంటుంది. మనకు సంబంధం లేని మాటలు మాట్లాడవల్సి వస్తుంది. సక్సెస్ గురించే మాట్లాడితే తప్పులు వెతికే వాళ్లు ఉంటారు. దాంతో వివాదంలో ఇరుక్కుపోతాం. అందుచేత సక్సెస్ అయ్యేంతవరకు కష్టపడుతాను. హిట్ నుంచి దూరంగా వెళ్లి పోతాను.

    మనమెందుకు కనిపించాలి. .

    మనమెందుకు కనిపించాలి. .

    పవన్ కల్యాణ్ ఇన్ని మాటలు చెప్పినా నేను మళ్లీ ఆయనను కన్విన్స్ చేసే విధంగా ప్రయత్నించాను. అందుకు జవాబుగా ఆయన మళ్లీ నచ్చచెప్తూ.. సినిమా సక్సెస్ అయిందా అని ప్రశ్నించారు. అందుకు నేను పెద్ద హిట్ అయింది అని అన్నాను. అందుకు సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనమెందుకు కనిపించాలి అని పవన్ చెప్పారు. ఆ మాటలను దువ్వాడ జగన్నాథ్‌లో చిత్రంలో ఉపయోగించుకొన్నాను. మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప.. మనిషి కనిపించకూడదు అనే డైలాగ్‌ను రాశాను. ఆ డైలాగ్‌కు పవన్ కల్యాణ్ స్ఫూర్తి అని అన్నారు.

    కట్టె కాలేంత వరకు పవన్ ఫ్యాన్‌నే..

    కట్టె కాలేంత వరకు పవన్ ఫ్యాన్‌నే..

    పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడని చాలా మంది అడుగుతుంటారు. గబ్బర్ సింగ్ సినిమా చేస్తానని అనుకోలేదు. ప్రకృతి సహకరించాలి. ఆయన నుంచి పిలుపురావాలి. సినిమా చేయకపోతే పవన్ కల్యాణ్ ఫ్యాన్ కాదన్నట్టు కాదు.. ఒక్కసారి పవన్ అభిమాని అయితే చచ్చి కట్టే కాలేంత వరకు ఫ్యాన్‌గానే ఉంటాను అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.

    English summary
    Director Harish Shankar speaks about Pawan Kalyan in Duvvada Jagannadham Audio Release. Harish said Few dialogues are written inspiration from Pawan Kalyan words.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X