twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’పై..... ‘రోబో’ డైరెక్టర్ శంకర్ కామెంట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా విడుదలైనప్పటి నుండే దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆలిండియా వ్యాప్తంగా ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఈ రేంజి సినిమా ఇప్పటి వరకు రాక పోవడమే ఇందుకు కారణం. పలువురు సినిమా ప్రముఖులతో పాటు ఆనంద్ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం బాహుబలి సూపర్ అంటూ ప్రశంసించారు.

    తాజాగా ఈ లిస్టులో సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా చేరి పోయారు. ‘బాహుబలి ఎపిక్ థాట్స్, పోయెటిక్ ఇమేజినేషన్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, సూపర్ హీరోయిజమ్, స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్....వావ్, రాజమౌళి మరియు అతని టీంకు అభినందనలు' అంటూ శంకర్ ట్వీట్ చేసారు.

    ఇండియాలోని ప్రముఖుల ప్రశంసలు ఒక ఎత్తయితే.....‘రోబో' డైరెక్టర్ శంకర్ ప్రశంసలు మరో ఎత్తు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సూపర్ అనిపించిన మూవీ ‘రోబో'. ఇపుడు రాజమౌళి ‘బాహుబలి' అంతుకు మించిన ప్రశంసలు అందుకుంటోంది.

    ‘బాహుబలి' సినిమా రిలీజైతే టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంతా ముందే ఊహించారు. ఎట్టకేలకు ఈ సినిమా సోమవారం(4వ రోజు).... 82 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

    ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం రూ. 83 కోట్లతో టాపులో ఉండేది. బాహుబలి చిత్రం కేవలం 4 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి ‘బాహుబలి' 200 కోట్ల క్లబ్బులో చేరింది. తెలుగు వెర్షన్ 83 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా బిజినెస్ మొత్తం పూర్తయ్యే వరకు వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

    Director Shankar tweet about Baahubali

    2009కి ముందు మహేష్ బాబు నటించిన ‘పోకిరి' సినిమా ఇండస్ట్రీ రికార్డుగా ఉండేది. 2009లో వచ్చిన ‘మగధీర' చిత్రం 9 రోజుల్లో ఆ రికార్డును బద్దలు కొట్టింది. తర్వాత ‘అత్తారింటికి దారేది' చిత్రం మగధీర రికార్డు బద్దలు కొట్టడానికి దాదాపు 25 రోజుల సమయం తీసుకుంది. తాజాగా బాహుబలి కేవలం 4 రోజుల్లోనే ‘అత్తారింటికి దారేది' రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం.

    English summary
    "Bahubali-Epic Thoughts!Poetic Imagnatn!Strong Characterisatns!Super Heroism!Executd wit Stuning Visuals! Vowww! Cheers 2 Rajmouli n his team" Director Shankar tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X