twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 25వ సినిమాకు తివిక్రమ్ నిర్మాతట.. భారీ సాహసమే..

    సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు తాను నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వెంటనే

    By Rajababu
    |

    రానున్న ఎన్నికల కోసం జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు తాను నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వెంటనే దర్శకుడు త్రివిక్రమ్‌‌తో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో పవన్, త్రివిక్రమ్‌లు ఉన్నట్టు సమాచారం.

    దర్శక, నిర్మాతగా త్రివిక్రమ్

    దర్శక, నిర్మాతగా త్రివిక్రమ్

    అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తున్నది. దేవుడే దిగివచ్చినా ఈ సినిమా టైటిల్ అని ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమాకు అసలు నిర్మాత త్రివిక్రమ్ అని చెప్పుకొంటున్నారు. కానీ ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్ బ్యానర్‌లో నిర్మాత రాధాకృష్ణ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాధాకృష్ణ కేవలం పేరుకు మాత్రమే నిర్మాత అని తెలుస్తున్నది. సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రతీ పైసా త్రివిక్రమ్ ఖర్చు పెడుతున్నట్టు వార్తలు వెలువుడుతున్నాయి.

     సినిమాలకు ప్రోత్సాహం

    సినిమాలకు ప్రోత్సాహం

    గతంలో సినిమా నిర్మాణాలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా, కొత్త దర్శకులకు నిర్మాతలుగా వ్యవహరించాలన్న ప్రణాళికను పవన్, త్రివిక్రమ్‌లు రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ సినిమాతోనే నిర్మాతగా త్రివిక్రమ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.

    బడ్జెట్ కంట్రోల్..

    బడ్జెట్ కంట్రోల్..

    ఈ సినిమా బడ్జెట్ సుమారు వంద కోట్ల రూపాయలు. సినిమా ప్రొడక్షన్ జరుగుతుండగా బడ్జెట్ పెరిగిపోకుండా తివిక్రమ్ తగు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు సమాచారం. ముందుగా వేసుకొన్న బడ్జెట్‌లో కనీసం పదిశాతమైనా మిగిల్చాలనే ప్రణాళికతో త్రివిక్రమ్ ముందుకెళ్తున్నట్టు సమాచారం. ఈ విధంగా పవన్ 25వ సినిమాకు త్రివిక్రమ్ నిర్మాతగా మారారు అనే మాట వినిపిస్తున్నది. అయితే ఈ వార్త రూమారా లేక వాస్తవమేనా అనే విషయంతో త్వరలో తెలిసే అవకాశం ఉంది.

    హ్యాట్రిక్‌ వైపు అడుగులు

    హ్యాట్రిక్‌ వైపు అడుగులు

    పవన్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సంచలన విజయాలు సాధించాయి. ప్రస్తుతం పవన్‌కు భారీ హిట్ పడితే కానీ ఇటు సినీ రంగంపై, అటు రాజకీయ రంగంపై పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగాను, క్రేజ్ విషయంలో ఎలాంటి అవకాశాలు చేజార్చుకోవద్దనే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. కథాపరంగా సామాజిక అంశాలను కూడా ఈ చిత్రంలో ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తున్నది.

    శరవేగంగా షూటింగ్..

    శరవేగంగా షూటింగ్..

    ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కాఫీ షాప్‌లో ప్రారంభమైంది. పవన్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య రొమాంటిక్ సీన్లను త్రివిక్రమ్ చిత్రీకరించారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నటిస్తున్నట్టు సమాచారం. పవన్ సరసన కీర్తీ సురేశ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.

    English summary
    There is report suggest that, Director Trivikram Srinivas turned as producer for Pawan Kalyan's 25th movie. Devude digivachchina is the title in news. This duo is setting a goal to achieve huge hit after Jalsa and Attarintiki daredi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X