» 

శివశంకర్‌ మాస్టర్ కి డాక్టరేట్

Posted by:

Shiva Shankar
హైదరాబాద్ : ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్‌కు బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ ట్రస్ట్‌ పీస్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌ అందించింది. ఇటీవల ఆయన ఈ డాక్టరేట్‌ని స్వీకరించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ ఇలా దాదాపు పది చిత్రసీమలతో ఆయనకు అనుబంధం ఉంది. 'మగధీర' చిత్రానికి ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకొన్నారు.

శివ శంకర్ మాట్లాడుతూ... ''మీ నృత్యంలో పవిత్రత ఉంది. అందుకే ఈ పురస్కారం అందిస్తున్నాం... అని ఈ సంస్థ ప్రతినిధులు నాకు చెప్పారు. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది. నృత్యమే నా శ్వాస. అదే నా జీవితం. ఎన్ని భాషల్లో పనిచేసినా తెలుగు సినిమాలంటేనే నాకు ప్రేమ. నటుడిగానూ రాణించాలని ఉంది'' అన్నారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్ కి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

ఇక శివ శంకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ గానే కాక, టీవి పోగ్రామ్స్ లోనూ పాపులర్. ఇక రీసెంట్ గా విడుదలైన మసాలా చిత్రంలో తన పాత్రకు శివ శంకర్ పాత్రే స్పూర్తి అని రామ్ అన్నారు. రామ్ మాట్లాడుతూ.. 'మసాలా' లో రెండో రకం పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా తర్ఫీదు పొందటంలాంటిదేమీ లేదు . అయితే ఆ పాత్ర విషయంలో శివశంకర్‌ మాస్టర్‌ నాకు బాగా సహకరించారు. సినిమాలో ఆ పాత్రపై ఓ పాట ఉంటుంది. దాంతోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. శివశంకర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చడంతో నా పని సులువైంది. సినిమా మొత్తం ఆయన్ని అనుకరిస్తూ నటించా. రెండు కోణాల్లో సాగే పాత్ర అది. రెండో రకం పాత్ర కాస్త తేడాగా ఉంటుంది అన్నారు.

Read more about: shiva shankar, ram, masala, maghadheera, శివ శంకర్ మాస్టర్, రామ్, మసాలా, మగధీర
English summary
Dance Master Shiva Shankar gets Doctorate. Shiva Shankar master is a famous Dance Master.

Telugu Photos

Go to : More Photos