twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైట్‌ హౌస్‌లో ఎఆర్ రహమాన్ 'జైహో'

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన జీవిత విశేషాలతో రూపొందించిన 'జై హో' డాక్యుమెంటరీని వైట్‌ హౌస్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ ని ఇక్కడ చూడండి

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రెహమాన్‌ వ్యక్తిగత జీవితం, వృత్తిగత విశేషాలను, ఆయన సంగీతంలో చూపించిన వైవిధ్యాన్ని ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు దర్శకుడు ఉమేష్‌ అగర్వాల్‌. ఆస్కార్‌, గ్రామీ పురస్కారాలు అందుకున్న నాటి విషయాలకూ ఇందులో చోటు కల్పించారు.

    Documentary on AR Rahman screened at White House

    రెండు ఆస్కార్లు అందుకుని భారతీయ సినిమా కీర్తిని ఇనుమడింపజేసిన స్వర తరంగం ఎ.ఆర్‌.రెహమాన్‌ - తనకు ఆస్కార్‌పై ఆశలుపోయాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ''దాదాపు 12 సంవత్సరాల తరవాత ఓ కచేరి నిర్వహించబోతున్నాను. ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో ఆశగా ఉండేది. ఇప్పటికి నెరవేరుతోంది. ఒకేసారి రెండు ఆస్కార్‌ అవార్డులు తీసుకున్న తరవాత ఆ పురస్కారమ్మీద మోజుపోయింది. తమిళ చిత్రాలకు సంగీతం అందించడం చూసి.. బాలీవుడ్‌లో 'మాకెందుకు చేయట్లేదు' అని అడుగుతున్నారు. నాకు అలాంటి తారతమ్యాలు లేవు'' అన్నారాయన .

    చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో మీ అబ్బాయి ఆమీన్‌ - పియానో వాయించారు. మరి ఈ కచేరీల్లో కూడా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు.. ''అతనిప్పుడు సంగీతం బాగా నేర్చుకుంటున్నాడు. నేను రూపొందించిన ఆల్బంలో నటించాడు. అమీన్‌ కూడా ఆల్బం రూపొందించే ఆలోచనలో ఉన్నాడు''అని పేర్కొన్నారు.

    English summary
    Oscar-winning composer A.R. Rahman found its way inside the White House in Washington through a special screening of Jai Ho, a documentary on his work. The 60-minute documentary was screened on Friday. The "Mozart of Madras", who has hit the right notes with each of his compositions with examples like “O rey chhori” and “Tum tak”, became a part of the special moment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X