twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరు ఈ సైట్లో బాహుబలి-2 టికెట్లు కొన్నారా? అయితే మీరు మోసపోయారు!

    బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసారు. ఓ నకిలీ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి టికెట్ల అమ్మకం ప్రారంభించారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసారు. ఓ నకిలీ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి టికెట్ల అమ్మకం ప్రారంభించారు. ఒక వేళ మీరుగానీ ఆ సైట్లో టికెట్స్ కొని ఉంటే మీరు మోసం పోయినట్లే.

    www.newtickets.in పేరిట ఓ నకిలీ సైట్ క్రియేట్ చేసి టిక్కెట్లు అమ్ముతున్నారు. టికెట్ కొనుగోలు చేయగానే మనకు సీటు అలాట్ అయినట్లు మెసేజ్ కూడా వస్తోంది. అయితే మనం రెగ్యులర్ గా సినిమా టికెట్లు కొనుగోలు చేసే వెబ్ సైట్లలో టికెట్స్ ఆల్రెడీ అమ్ముడయ్యాయి. ఇందులో మాత్రం సీట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది.

    ఈ సైట్ వ్యవహారంపై అనుమానం వచ్చిన అధికారులు దీని గురించి ఆరాతీయగా నకిలీ వెబ్ సైట్ గా తేల్చారు.....

    హైదరాబాద్ తో పాటు విదేశాల్లో కూడా...

    హైదరాబాద్ తో పాటు విదేశాల్లో కూడా...

    ఈ వెబ్ సైట్లలో హైదరాబాద్‌తోపాటు అమెరికా, ఇంగ్లాండులోని కొన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. సాధారణంగా అయితే ఏ సైట్లో ఇలా చూపించదు.

    ఒక్కో టిక్కెట్ రూ. 120

    ఒక్కో టిక్కెట్ రూ. 120

    ఈ నకిలీ వెబ్ సైట్లో ఒక్కో టిక్కెట్‌ రూ.120 చొప్పున అమ్మారు. కొందరు ఈ సైట్ ద్వారా టిక్కెట్లు కొని మోసపోయారు. ఈ సైట్లో టికెట్స్ కొని బాహుబలి 2 చూస్తున్నామనే సంబరంలో ఉన్న వారు ఈ విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.

    ఈ నెలలోనే క్రియేట్ చేసారు

    ఈ నెలలోనే క్రియేట్ చేసారు

    కోయంబత్తూర్‌ చిరునామాతో ఈనెల 7న వెబ్‌సైట్‌ నమోదు చేయించారని, సంవత్సరం పాటు సర్వర్‌ను లీజుకు తీసుకున్నారని, డబ్బు చెల్లింపులకు ‘పేయూమనీ'తో ఒప్పందం చేసుకున్నారని సైబర్ సెల్ అధికారులు తేల్చారు.

    అప్రమత్తంగా ఉండండి

    అప్రమత్తంగా ఉండండి


    ఆన్ లైన్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని... కొత్త వెబ్ సైట్లు కనిపించినపుడు అవి అసలైనవా? నకిలీవా? అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని సీఐడీ సైబర్‌ నేరాల విభాగం ఎస్పీ రామ్మోహన్‌ తెలిపారు.

    English summary
    Don't buy Baahubali 2 tickets in newtickets site, it is fake website. Baahubali 2: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X