twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన సినీ స్టార్స్ ఎంత వరకు చదువుకున్నారు? (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    ముంబై : చదువుల్లో రాణించలేక పోయిన వారే సినిమా రంగం వైపు అడుగులు వేస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందులో ఎంతో కొంత నిజం ఉండవచ్చేమో కానీ..సినిమా రంగంలో అగ్రతారలుగా వెలుగొందిన వారిలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారే. అయితే సినిమా రంగంపై ఆసక్తితో ఇటువైపు అడుగులు వేసారు.

    కొందరైతే చదువుల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి టాప్ ప్లేస్ దక్కించుకున్నవారే. అయితే ఆయా రంగాల వైపు వెళ్లకుండా సినీరంగంలో అడుగు పెట్టి తమ సత్తా నిరూపించుకున్నారు. మంచి సంపాదన, పాపులారిటీ, ప్రత్యేక గుర్తింపు లాంటివి ఈ రంగంలో దక్కుతుండటం అందుకు కారణం కావచ్చు.

    ఉన్నత చదువులు చదివినా...ఆయా రంగాల వైపు వెళ్లకుండా తమ అభిరుచికి తగిన విధంగా సినీరంగాన్ని ఎంచుకుని పాపులర్ అయిన స్టార్స్ వివరాలు స్లైడ్ షోలో వీక్షిద్దాం....

    చిరంజీవి

    చిరంజీవి

    మెగాస్టార్ గా....టాలీవుడ్ నెం.1 స్థానాన్నిసొంతం చేసుకున్న చిరంజీవి కామర్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు.

    నాగార్జున

    నాగార్జున

    అక్కినేని నాగార్జున మెకానికల్ ఇంజనీరింగ్ చేయడంతో పాటు, మిచిగాన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసారు.

    బాలకృష్ణ

    బాలకృష్ణ

    నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో ఆర్ట్స్ విభాగంలో గ్రాజ్యువేషన్ సాధించారు

    వెంకటేష్

    వెంకటేష్

    విక్టరీ వెంకటేష్ చెన్నై లయోలా కాలేజీలో గ్రాజ్యువేషన్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి ఎంబీఏ పూర్తి చేసారు.

    జాన్ అబ్రహం

    జాన్ అబ్రహం

    ముంబైలోని స్కాటిష్ స్కూల్లో చదివిన జాన్ అబ్రహం, జైహింద్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ సాధించారు. మేనేజ్ మెంట్ సైన్సెస్ లో కూడా డిగ్రీ పట్టా పొందారు.

    సోనమ్ కపూర్

    సోనమ్ కపూర్

    సోనమ్ కపూర్ స్కూల్ లైఫ్ సింగపూర్లో సాగింది. ఆ తర్వాత లండన్ లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు.

    ఆయుష్మాన్ ఖురానా

    ఆయుష్మాన్ ఖురానా

    ఆయుష్మాన్ ఖురానా ఇంగ్లిష్ లిటరేచర్, మాస్ కమ్యూనికేషన్ పట్టా సాధించారు.

    సోనాక్షి సిన్హా

    సోనాక్షి సిన్హా

    బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫ్యాషన్ డిజైనింగులో డిగ్రీ పూర్తి చేసింది.

    అమితాబ్ బచ్చన్

    అమితాబ్ బచ్చన్

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆర్ట్స్ మరియు సైన్స్ విభాగంలో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు.

    ప్రీతి జింతా

    ప్రీతి జింతా

    బాలీవుడ్ భామ ప్రీతి జింతా ఇంగ్లీష్ హానర్ డిగ్రీ తర్వాత...క్రిమినల్ సైకాలజీలో ప్రోస్టుగ్రాజ్యువేషన్ పూర్తి చేసింది.

    రణదీప్ హుడా

    రణదీప్ హుడా

    బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా మార్కెటింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు, ఆస్ట్రేలియాలో బిజినెస్ మేనేజ్ మెంట్, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్ మెంటులో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

    సోహా అలీ ఖాన్

    సోహా అలీ ఖాన్

    సోహా అలీ ఖాన్ లండన్‌‍లో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ సాధించింది.

    సోనూ సూద్

    సోనూ సూద్

    నటుడు సోనుసూద్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాజ్యువేషన్ సాధించారు.

    విద్యా బాలన్

    విద్యా బాలన్

    విద్యా బాలన్ సోషియాలజీలో మేజర్ డిగ్రీ సాధించింది.

    మాధవన్

    మాధవన్

    మాధవన్ ఎలక్ట్రానిక్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు. మహారాష్ట్ర బెస్ట్ క్యాడెట్ టైటిల్ సొంతం చేసుకున్నారు.

    అమీషా పటేల్

    అమీషా పటేల్

    హీరోయిర్ అమీషా పటేల్ అమెరికాలో చదివి ఎకనామిక్స్ విభాగంలో మేజర్ డిగ్రీ సాధించింది.

    సిద్ధార్థ

    సిద్ధార్థ

    హీరో సిద్ధార్థ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్ విభాగంలో ఏంబీఏ పూర్తి చేసారు

    నేహా శర్మ

    నేహా శర్మ

    హీరోయిన్ నేహా వర్మ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాజ్యువేషన్ పూర్తి చేసింది.

    English summary
    Education qualification of our movie celebrities. Have you ever thought how educated your favourite star is? Most of the stars who come to Bollywood in order to fulfil their dreams leave their studies mid way. Some of them are highly intelligent and were toppers in their school, while for some education was never their cup of tea. While there are few actors who completed their studies and then entered the world of glamour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X