» 

ఫ్లాప్ అని రిలీజ్ కు ముందే తెలుసా?

Posted by:
Give your rating:

హైదరాబాద్ : సినిమా టాక్ ఇంతకుముందులా టైమ్ తీసుకోవటం లేదు. రిలీజైన మార్నింగ్ షో ...ఇంటర్వెల్ కే బయిటకు వచ్చేస్తోంది. దాంతో కంగారుపడుతున్న దర్శక,నిర్మాతలు నష్టం నివారణ చర్యల్లో భాగంగా ట్రిమ్ చేసి వదలటం వంటి మార్పులు చేస్తున్నారు. అయితే తాజాగా సుమంత్ హీరోగా వచ్చిన 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రానికి ఈ ప్రమాదం ముందే ఊహించి రిలీజ్ కు ముందే మరో వెర్షన్ రెడీ చేసారట. అది ఇప్పుడు థియోటర్లలో వదులుతున్నారని సమాచారం.

వరస ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ ఈ సారి నవ్వించి హిట్ కొడతానంటూ 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రంతో శనివారం ముందుకు వచ్చాడు. అనుకున్న రోజు కంటే ఓ రోజు లేటుగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగానూ బాగా లేటుగా వచ్చిన సినిమా అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ బుల్లబ్బాయ్ గా కామెతో కూడిన ఓ విలక్షణమైన పాత్రను పోషించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు ఇప్పటికే మంచి హిట్టయ్యాయి. అయినా ఫలితం నెగిటివ్ గా వచ్చింది.

అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్ కాంబినేషన్ లో వచ్చిన నమస్తే లండన్ చిత్రానికి నకలు ఈ చిత్రం అని తేలటంతో కథ,కథన పరంగానూ అంతా పెదవి విరుస్తున్నారు. చంద్రసిద్దార్ద గత చిత్రాలు తరహాలో ఈ చిత్రం ఉంటుందని థియోటర్ కి వెళ్లిన వారికి నిరాసే మిగిలింది. పరమ రొటీన్ కథను అంతకంటే రొటీన్ గా దర్శకుడు డీల్ చేసాడని టాక్ వినిపించింది.

కథేమిటంటే...పదోతరగతి పద్నాలుగుసార్లు తప్పిన బుల్లెబ్బాయ్‌( సుమంత్) కి ఓ కోరిక ఉంది. అదే.. అమెరికాకు వెళ్లడం. అలాగే అతనికి మరదులు నీలవేణి(పింకీ) అంటే చాలా ఇష్టం. అమెరికాలో సెటిల్ అయిన ఆమెకు సంభంధాలు చూస్తూంటే వేరే దారిలేక బుల్లెబ్బాయిని పెళ్లిచేసుకుంటుంది. అతని పెళ్లిచేసుకుని అమెరికా వెళ్లి అక్కడ విడాకులు ఇచ్చి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఆలోచన. ఇదంతా బుల్లిబ్బాయికి తెలుసు. కానీ కాదనుకుంటా పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఏమైంది. వారి వివాహ బంధం ఏ తీరానికి చేరిందనేది మిగతా కథ.

Read more about: sumanth, emo gurram egaravachu, pinki savika, సుమంత్, ఏమో గుర్రం ఎగరావచ్చు, పింకీ సావిక
English summary
‘Emo Gurram Egaravachchu’ directed by Chandra Siddhartha failed to attract viewers releasing last Friday. According to the latest the film makers are planning to screen the second version in theaters starting from Monday.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive