» 

బ్యాడ్ న్యూస్: 'ఏమో గుర్రం ఎగరావచ్చు' రిలీజ్ ఆగింది

Posted by:

హైదరాబాద్ : సుమంత్ ఈ సారి నవ్వించి ఎలాగైనా హిట్ కొడతానంటూ 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రంతో ఈ రోజు ముందుకు రావటానికి ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఫైనాన్స్ సమస్యలతో ఈ రోజు షోలు ఆగిపోయాయి. ఈ రోజు సాయింత్రానికి అయినా సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బిజినెస్ అనుకున్న రీతిలో కాకపోవటంతో ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో సుమంత్ బుల్లబ్బాయ్ గా కామెతో కూడిన ఓ విలక్షణమైన పాత్రను పోషించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు ఇప్పటికే మంచి హిట్టయ్యాయి. .జీవితంలో ప్రతి విషయం పద్ధతిగా జరగాలనుకునే అమ్మాయికి, ప్రణాళికలు అవసరం లేదనుకునే అబ్బాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా.ఇందులో సుమంత్ ..బుల్లెబ్బాయ్‌గా కనిపిస్తాడు. పల్లెటూరి బైతు. పదోతరగతి పద్నాలుగుసార్లు తప్పిన బుల్లెబ్బాయ్‌కి ఓ కోరిక ఉంది. అదే.. అమెరికాకు వెళ్లడం. మరి వెళ్లాడో లేదో తెరపై చూసి తెలుసుకోవలసిందే. తొలిసారి ఈ సినిమాకోసం చీర కట్టారు. అదీ కథలో భాగంగానే వస్తుంది.

సుమంత్ ..కెరీర్‌లో ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. నాకే షాకింగ్‌గా అనిపించింది. సినిమా అంతా నవ్విస్తూనే ఉంటా. కథ వినగానే 'ఇది రవితేజ, సునీల్‌ చేయాల్సిన సినిమా' అనిపించింది. 'ఏమో గుర్రం ఎగరావచ్చు' టైటిల్‌ కూడా ఆసక్తి రేకెత్తించింది. 'ఇలాంటి టైటిల్‌ ఏంటి?' అనుకొన్నా. అయితే ఆ తరువాత ఈకథకి ఈ పేరే కరెక్ట్‌ అనిపించింది. కీరవాణిగారు అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. నా సొంత సినిమా అనుకొని పనిచేశారాయన'' అన్నారు.

అలాగే ''తొలిసారి ఈ సినిమాకోసం చీర కట్టా. అదీ కథలో భాగంగానే వస్తుంది. చంద్రసిద్దార్థ్‌ చీర సంగతి చెప్పిప్పుడు 'అవసరమా?' అని అడిగా. కానీ ఆయన సందర్భం చెప్పిన తరవాత కాదనలేకపోయా. ఈ సినిమా ఇంట్లోవాళ్లకు చూపించా. తాతగారికి బాగా నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుకొన్నారు. ఈమధ్య తాతగారు సినిమాలెక్కువగా చూసారు. ఈమధ్య కాలంలో నేనూ అన్ని సినిమాలు చూళ్లేదేమో..?'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "సినిమా ఆద్యంతం చాలా బాగా వచ్చింది. టైటిల్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సుమంత్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. ఓ సందర్భంలో లేడీ గెటప్‌లోనూ కనిపిస్తారు. సుమంత్ లేడీ గెటప్ స్టిల్స్‌కు చక్కటి రెస్పాన్స్ వస్తోంది. ఇదొక రొమాంటిక్‌ ఎంట ర్‌టైనర్‌. ఆధునిక దృక్పథం ఉన్న అమ్మాయికి, పల్లెటూరి కుర్రాడికి మధ్య సాగే వినోదాత్మక కథ ఇది'' అని అన్నారు.

Read more about: sumanth, emo gurram egaravachu, pinki savika, సుమంత్, ఏమో గుర్రం ఎగరావచ్చు, పికీ సావిక
English summary
Here is a bad news for Sumanth who has pinned a lot of hopes on his upcoming film Emo Gurram Egaravachu. The film is slated for a grand release on today but due to some financial issues all shows are cancelled. Buzz is that the film makers are putting their best to release the film on today evening. sizzling beauty Pinky Savika is sharing screen with Sumanth in this family entertainer. S.S. Kanchi is providing script P. Madan Kumar is producing this film. Keeravani is scoring the music.
Please Wait while comments are loading...