»   » నగలు దోచుకొని రేప్ చేసాడు: నిర్మాత మేనల్లుడి పై కేసు నమోదు

నగలు దోచుకొని రేప్ చేసాడు: నిర్మాత మేనల్లుడి పై కేసు నమోదు

Posted by:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై రేప్ కేసు నమోదైంది. ఆ కేసు పెట్టింది మరెవరో కాదు అతని భార్య. తన భర్త వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నగలన్నీ తీసుకున్నాడని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడనేది ఆమె ప్రధాన ఆరోపణ.

అంతేకాకుండా తనను వేధించేవాడని, ఇష్టం లేకపోయినా శృంగారం చేయాలంటూ బలవంతం చేసేవాడని ఒక రోజు తనకు ఇష్టం లేదని చెప్తున్నా అత్యాచారానికి ప్రయత్నించాడనీ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్న వెర్సోవా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

rape case

నిందితుడిపై 376(రేప్), సెక్షన్ 498(ఏ)(భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్మాతకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్‌ బాధ్యతలు నిందితుడు చూసుకునేవాడని తెలుస్తోంది.

కానీ ఆ నిర్మాత ఎవరూ... అనే విషయాన్నీ మాత్రం పోలీసులు బయట పెట్టటం లేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో వివరాలన్నీ బయటకు రావచ్చంటున్నారు.

English summary
The nephew of a film producer was booked after his wife approached the police recently and accused him of harassment and rape
Please Wait while comments are loading...