Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ 'నో నో' అన్నాడు...నితిన్ ..'రా రా' అన్నాడు
హైదరాబాద్ : మొత్తానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ తెలుగులో అవకాసం సంపాదించాడు. ఆ మధ్యన రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం చేస్తాడనుకుని చివరి నిముషంలో తప్పుకున్న అనిరుధ్ ఇప్పుడు నితిన్ సినిమాతో ఎంట్రీ సంపాదించాడు. ఇందులో నితిన్ పాత్రే ఎక్కువ ఉందని తెలుస్తోంది. ఈ కొలవారి కుర్రాడు తనకు ఊపిచ్చే సంగీతంతో నిలబెడతాడని భావిస్తున్నాడు నితిన్. ఈ విషయమై నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న నిర్మాత రాధాకృష్ణ ఇచ్చిన ప్రెస్ నోట్ ఖరారు చేసింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక నితిన్ చిత్రం విషయానికి వస్తే...
నితిన్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు. కథా నాయికగా సమంతను ఎంచుకొన్నారు. నితిన్, సమంత కలసి నటించడం ఇదే తొలిసారి. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత.
ఆయన మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌తో ఇది మా మూడో చిత్రం. ఇది వరకు తెరకెక్కించిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' మంచి విజయం సాధించాయి. నితిన్ చిత్రంతో హ్యాట్రిక్ కొడతాం. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు త్వరలో ప్రకటిస్తాము''అన్నారు. వచ్చే నెల మూడో వారంలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.