»   » సూపర్ గా ఉంది: మహేష్ ‘బ్రహ్మోత్సవం’ లోగో ఇదిగో

సూపర్ గా ఉంది: మహేష్ ‘బ్రహ్మోత్సవం’ లోగో ఇదిగో

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు( మే 31న) అంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో నిర్మాతలు...చిత్రం లోగోని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ లోగోని చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ప్రతీ ఏడు జరుగుతుంది వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవం...ఈ ఏడే జరుగుతుంది నటశేఖరుడి స్వర్ణోత్సవం అనే వాక్యాలు రాసి ఈ లోగోతో కలిపి విడుదల చేసారు. టైటిల్ తగ్గట్లో చక్కటి డిజైన్ తో ఈ లోగో ఉండటం మహేష్ అభిమానులను ఆనందపరిచే విషయమే.


గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.


First Look: Mahesh Brahmotsavam Logo

మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒకరుగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేయగా మరో ఇద్దరిని ఎంపిక చేసే పనిలో శ్రీకాంత్ అడ్డాల ఉన్నాడు.


ప్రస్తుతం....


కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న శ్రీమంతుడు షూటింగ్ పూర్తికావొచ్చింది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను జూలై 17న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత మహేష్‌బాబు నటించే మరో సినిమాకు జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు భారీ క్రేజ్ నెలకొంది. వచ్చే నెలలో ఈ చిత్రంలోని పాటలను విడుదల చేస్తారు. ఈ సినిమా తరువాత మహేష్ మరో చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. గోపీచంద్‌తో వరుసగా సినిమాలు నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని తెలిసింది.


దాంతోపాటు భవ్య సిమెంట్‌కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వార్తలు త్వరలో వెల్లడయ్యే అవకాశం వుంది.

English summary
Producer PVP has finally unveiled the logo-design of Mahesh Babu’s next film Brahmotsavam by wishing Birthday wishes to Krishna. “Prathi edu jarugutundi Venkateswarudi Brahmotsavam. Ee edey jarugutondi Nata sekharuni Swarnotsavam”, reads the poster, wishing Krishna a happy birthday.
Please Wait while comments are loading...