» 

శర్వానంద్ "రన్ రాజా రన్'' ఫస్ట్ లుక్(ఫోటోలు)

Posted by:
 

హైదరాబాద్ : శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రన్ రాజా రన్'' ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ... గత సంవత్సరం "మిర్చి'' లాంటి విజయవంతమైన సినిమాను మా బేనర్ లో చేశాము. మా తొలి ప్రయత్నం విజయవంతం అయినందుకు ఆనందంగా ఉంది. అదే ఆదనందంతో శర్వానంద్ హీరోగా సుజీత్ ని దర్శకుడిగా పరిచయం చూస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం "రన్ రాజా రన్'' .

ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు చెప్పిన కథ మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాము. కథనం విషయానికి వస్తే ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్నారు.

స్లైడ్ షోలో..ఫస్ట్ లుక్ పోస్టర్స్

టీమ్..


"మిర్చి'' సినిమాకు కెమెఆరా మెన్ గా పని చేసిన మధి ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు. ఘిబ్రాన్ .యమ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే మేము ఖర్చకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు.

ప్రెష్ గా ఉన్నాడని..


ఉగాది సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేశాము. ఈ ఫస్ట్ లుక్ లో హీరో శర్వానంద్ చాలా ఫ్రెష్ గా ఉన్నాడని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తెలుగు,తమిళ భాషల్లో..

 

లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ సర్ ఫ్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది. అలాగే ఈ సినిమా టైటిల్ కథకి పక్కా యాప్ట్ అవుతుంది. కథకి తగ్గ పాత్రలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నాము అన్నారు.

 

నటీనటులు..

శర్వానంద్, సీరత్ కపూర్, అడవి శేషు, సంపత్, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్, అలీ, కోటాశ్రీనివాసరావు, విద్యలేఖ రామన్, అజయ్ ఘోష్, నటించారు.

 

Read more about: sarwanand, mirchi, prabhas, శర్వానంద్, మిర్చి, ప్రభాస్
English summary
'Run Raja Run' is the second production from the makers of Mirchi film. This film stars Sharwanand in title role. Sujeeth is directing the film. Ghibran composes music and Madhie handles camera.
Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos