»   » ఈ రోజు నుంచే : గన్స్ వదిలి గర్ల్స్ తో పవన్ రచ్చ

ఈ రోజు నుంచే : గన్స్ వదిలి గర్ల్స్ తో పవన్ రచ్చ

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో సర్దార్‌ గబ్బర్‌ సింగ్ చిత్రం కోసం ప్రత్యేకగీతాన్ని తెరకెక్కించబోతున్నారు. కళా దర్శకుడు బ్రహ్మ కడలి నేతృత్వంలో తీర్చిదిద్దిన ఓ సెట్‌లో పవన్‌, రాయ్‌లక్ష్మీలపై ఆ పాటని చిత్రీకరిస్తారు.

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్‌ హీరోయిన్. రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌ మరార్‌ నిర్మాత.

గుండెలనిండా ధైర్యమే కాదు... మనసు నిండా ప్రేమ కూడా ఉన్నోడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌. పోలీసు కదా అని ఎప్పుడూ గన్నులతోనే గడుపుతుంటాడనుకొంటే పొరపాటు. అప్పుడప్పుడు జున్ను లాంటి అమ్మాయిలతోనూ సరసాలు ఆడుతుంటాడు. మొన్నటిదాకా విలన్స్ పై తూటాలు పేల్చిన సర్దార్‌ ఇప్పుడు ఓ అందమైన అమ్మాయితో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ హంగామా ఎలా ఉంటుందో 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాలోనే చూడాలని అంటున్నారు.

From today: Pawan special song with Raai Lakshmi

'కాంచనమాల కేబుల్‌టీవీ'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత కూడా బోలెడన్ని చిత్రాలు చేసింది. ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. అయితే పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడం ఇదే తొలిసారి. లక్ష్మీ రాయ్‌గా పరిచయమైన ఆమె కొంతకాలం క్రితమే తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకొంది.

పవన్‌తో కలిసి నటించే సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో హీరోయిన్ గా ఇప్పటికే కాజల్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

From today: Pawan special song with Raai Lakshmi

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ నుంచి ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ జయనేని విన్సెంట్ బయిటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బయటకు రావటానికి కారణం ఈ చిత్రం కొత్త షెడ్యూల్ లో ఇగో క్లాషెష్ చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయమై పవన్ మధ్యలో వేలు పెట్టలేదని, బాబి తనకు నచ్చిన కెమెరామెన్ ఆర్దర్ ఎ విల్స్ ని తీసుకువచ్చి మిగతా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే షూటింగ్ డిలే అవుతూ వస్తోందని అంటున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

English summary
The fresh schedule of PawanKalyan and dirbobby's #SardaarGabbarSingh begins today with Raai lakshi's special song at Ramanaidu Studios, Hyd !
Please Wait while comments are loading...