» 

గబ్బర్‌సింగ్-2కు ముహూర్తం ఖరారు

Posted by:

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న 'గబ్బర్ సింగ్ 2′ సినిమా సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' సినిమాకి ఇది సీక్వెల్.

ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది.

గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈచిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సమైక్యాంధ్ర ఉద్యమకారులు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించడంతో విడుదల వాయిదా వేసారు.

Read more about: pawan kalyan, gabbar singh 2, sampath nandi, పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ 2, సంపత్ నంది
English summary
After Atharintiki Daaredi, Pawan Kalyan will move on to Gabbar Singh 2. The movie will go to the sets in September. 'Rachcha' director Sampath Nandi will be directing the movie while Pawan's close friend Sharat Marar will be producing it.
Please Wait while comments are loading...