twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గబ్బర్ సింగ్ 2: నొప్పి లేదు, రంగంలోకి పవన్ కళ్యాణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈచిత్రం ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. అనేకానేక కారణాలతో సినిమా ఇప్పటికీ పట్టాలెక్కలేదు. తాజా పరిస్థితి పరిశీలిస్తే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిచబోతున్నారు. ‘గోపాల గోపాల' విడుదల కావడంతో కాస్త ఫ్రీ అయిన పవన్ కళ్యాణ్....పర్సనల్‌గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు.

    ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కు బ్యాక్ పోయిన్ ఉందని, శస్త్ర చికిత్స కోసం ఆస్ట్రేలియా వెలుతున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే రూమర్స్ విన్న పవన్ కళ్యాణ్ నవ్వారట. అలాంటిదేమీ లేదు...నేను షూటింగుకు రెడీగా ఉన్నానని దర్శక నిర్మాతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించనున్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. తొలి షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట.

    ‘Gabbar Singh 2’ Pre-production details

    అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

    గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

    English summary
    Pawan Kalyan’s ‘Gabbar Singh 2’ has been in news for all sorts of reasons. As per the buzz, Pawan Kalyan is personally overseeing the film’s pre-production. The shoot is expected to start in the month of February.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X