»   » గౌతమీపుత్ర ఆడియో వాయిదా.... అసలు వాస్తవాలు ఇవే... చిరంజీవి తో పోటీ, వెంకయ్య నాయుడు కూడా

గౌతమీపుత్ర ఆడియో వాయిదా.... అసలు వాస్తవాలు ఇవే... చిరంజీవి తో పోటీ, వెంకయ్య నాయుడు కూడా

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఆడియో విడుద‌ల ఈ నెల 16న తిరుప‌తిలో నిర్వ‌హించాల‌నుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం వాయిదా పడింది

Posted by:
Subscribe to Filmibeat Telugu

బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని శ‌ర‌వేగంగా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల్ని జ‌రుపుకొంటోంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుద‌ల వేడుక‌ని ఈ నెల 16న తిరుప‌తిలో నిర్వ‌హించాల‌నుకొన్నారు. అయితే ఇప్పుడు ఉన్న‌ట్టుండి చిత్ర‌బృందం ఆడియో విడుద‌ల వేడుక‌ని వాయిదా వేసింది.

'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో ఫంక్షన్ కు సంబంధించి ఒక ఊహించని ట్విస్ట్ ఉందని వార్తలు వస్తున్నాయి. తిరుపతిలో నిర్వహించబోతున్న ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను నిర్వహించే బాధ్యతను ఒక ప్రముఖ మీడియా సంస్థకు 80 లక్షలు ఖర్చు పెట్టే విధంగా అగ్రిమెంట్ చేసుకుని ఆ మీడియా సంస్థకు ఆ ఆడియో ఫంక్షన్ ను నిర్వహించే భాధ్యతలు అప్ప చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరిన్ని విషేశాలు....

వారం రోజులు వాయిదా :


నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా వస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈనెల 16న తిరుపతిలో నిర్వహించాలనుకొన్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని అనివార్యకారణాల వలన ఆ కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేసుకోన్నట్లు తాజా సమాచారం.

80 లక్షలు ఖర్చు:


అయితే తిరుపతి వేదికలో ఎటువంటి మార్పులేదు. డిశంబర్ 24లోగా అక్కడే ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నట్లు తాజా సమాచారం.ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం జే మీడియా సంస్థ ‘శాతకర్ణి' ఆడియో ఫంక్షన్ ను 80 లక్షలు ఖర్చుచేసి నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీగా పేరుగాంచిన ఈ కంపెనీ విజయవాడలో వంగవీటి ఆ డియో ఫంక్షన్ కూడా నిర్వహించింది అని తెలుస్తోంది.

మరో షాకింగ్ న్యూస్ :


ఆడియో ఫంక్షన్ లైవ్ హక్కులు, స్పాట్ అడ్వర్ టైజ్ మెంట్లు, స్పాన్సర్ షిప్ ల ద్వారా ఆదాయం అంతా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి వచ్చినా ఇంత భారీ స్థాయిలో ‘శాతకర్ణి' ఆడియో ఫంక్షన్ కోసం ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ చేస్తున్న ఖర్చు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇది ఇలా ఉండగా నందమూరి బాల‌కృష్ణ అభిమానులకు ఈ ఆడియో ఫంక్షన్ విషయంలో మరో షాకింగ్ న్యూస్ ఉండబోతోంది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే అదేమిటన్నదీ ఇంకా స్పష్టత మాత్రం లేదు

డిసెంబ‌రు 20 నుంచి 26వ తేదీ:


ఈనెల 16న తిరుప‌తిలో ఈమూవి ఆడియో ఫంక్ష‌న్‌ ని గ్రాండ్ గా నిర్వ‌హించడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆడియో ఫంక్ష‌న్ స‌డ‌న్ గా వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. డిసెంబ‌రు 20 నుంచి 26వ తేదీ మ‌ధ్య‌న వేడుక జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు.

పైకి చెప్పటం లేదు :


ఈ ఆడియో విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌డానికి కార‌ణాలేవీ స్ప‌ష్టంగా తెలియకపోయినా ఈ ఆడియో ఫంక్షన్ కు రావలసిన రాజకీయ హేమాహేమీల డేట్స్ అందుబాటులో లేక పోవడంతో ఈమార్పు జరిగింది అని అంటున్నారు.పైకి చెప్పటం లేదు గానీ అసలు విషయం అందరికీ తెలిసిందే అదేమిటో అంతా ఊహించగలిగిందే

హేమ‌మాలిని, వెంక‌య్య‌నాయుడులే కార‌ణ‌ం:


అందుకు కార‌ణం న‌టి హేమ‌మాలిని, కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడులే కార‌ణ‌మ‌ట‌. వాళ్లిద్ద‌రికీ 16న వీలుప‌డ‌ద‌ట‌. దాంతో బాల‌య్య ఆడియో ఫంక్ష‌న్ డేట్ మార్చ‌మ‌ని చెప్పాడ‌ట‌. సినిమాలో హేమ‌మాలిని బాల‌కృష్ణ‌కి త‌ల్లిగా న‌టించిన విష‌యం తెలిసిందే. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు బాల‌కృష్ణ‌కి ఆప్తుడు. వాళ్లిద్ద‌రూ లేకుండా ఆడియో వేడుక జ‌ర‌ప‌డం బాల‌య్య‌కి మ‌న‌సొప్ప‌లేద‌ట‌.

మెగాస్టార్ చిరంజీవి:


అందుకే వాళ్ల వీలునుబ‌ట్టి ఫంక్ష‌న్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకొన్నారు. తిరుప‌తిలో వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ గ్రౌండ్‌లో జ‌రిగే ఆడియో ఫంక్ష‌న్‌కి ఏపీ సీఎం చంద్ర‌బాబు ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్న విష‌యం తెలిసిందే. ఒకవేళ ఆరోజుకి ముహూర్తం పెట్టుకొన్నట్లయితే, ఆ మరునాడే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్:150 ఆడియో రిలీజ్ ఫంక్షన్ విజయవాడలో జరుగబోతోంది.

అప్పుడే పోటీ మొదలయినట్లే :


వారిద్దరి సినిమాలు కూడా ఒక్క రోజు తేడాతో అంటే జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణి, 13న ఖైదీ నెంబర్:150 విడుదల కాబోతున్నాయి. కనుక రెంటి మద్య అప్పుడే పోటీ మొదలయినట్లే భావించవచ్చు. అయితే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత చేసిన ఖైదీ నెంబర్:150 పట్ల ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపడం సహజం. పైగా అది సాంఘిక చిత్రం..

బాలయ్య సినీ కెరీర్ లో :


అందులో అభిమానులకి, ప్రేక్షకులకి కావలసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కూడా. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రిక నేపద్యం ఉన్న చిత్రం. దానిలో చరిత్ర పాఠాలు, బారీ డైలాగులు, యుద్దాలే ఉంటాయి కనుక ప్రజల మొదటి ప్రిఫరెన్స్ ఖైదీ నెంబర్:150కే ఈయవచ్చు. ఏమైనప్పటికీ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బాగుండి అది హిట్ అయితే బాలయ్య సినీ కెరీర్ లో బెస్ట్ ఒఫ్ థి బెస్ట్మూవీస్ గా నిలిచిపోతుంది.

English summary
Balakrishna Nandamuri starrer Gautamiputra Satakarni was to have its audio launch on the 16th of December. But now there is a change in this. The latest reports say that audio launch has been postponed to the second week of December.
Please Wait while comments are loading...