»   » గౌతమి పుత్ర శాతకర్ణికి గుమ్మడి కాయ కొట్టారు: లాస్ట్ సీన్ బాలయ్య, శ్రీయా, హేమమాలినిలపై...

గౌతమి పుత్ర శాతకర్ణికి గుమ్మడి కాయ కొట్టారు: లాస్ట్ సీన్ బాలయ్య, శ్రీయా, హేమమాలినిలపై...

బాలయ్య హీరోగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు గుమ్మడి కాయ కొట్టారు. గౌతీమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటసింహ బాలకృష్ణ నటిస్తున్న చారిత్రక వందో సినిమాకు గుమ్మడి కాయ కొట్టారు. జాతీయ అవార్డు విజేత జాగర్లమూడి కృష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ సినిమాను నిరిస్తున్నారు.

సినిమా షూటింగ్ బుధవారంనాటితో ముగిసింది. ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టడం పట్ల నిర్మాతలు హర్షం వ్క్తం చేశారు. రామోడీ ఫిల్మ్ సిటీలో చివరి సీన్‌ను కృష్ణ్ బుధవారంనాడు చిత్రీకరించారు. ఈ సీన్‌ను హీరో బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలినిలపై చిత్రీకరించారు.

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం పట్ల నిర్మాతలు పొంగిపోయారు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను నిర్మిస్తున్నట్లు తాము ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రకటించిన విషయాన్ని నిర్మాతలు గుర్తు చేశారు.

నటీనటులు: బాలకృష్ణ, హేమమాలిని, శ్రియా శరన్, కబీర్ బేడీ, తదితరులు

ప్రెజెంటర్: బిబో శ్రీనివాస్
సినిమాటోగ్రాఫర్: జ్ఞానశేఖర్
ఆర్ట్: భూపేష్ భూపతి
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా
ఫైట్స్: రామలక్ష్మణ్
సంగీతం: చిరంతన్ భట్
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు
దర్శకత్వం: క్రిష్

హేమాహేమీల సమక్షంలో...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు, చిరంజీవి, వెంకటేష్, రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, తదితర హేమాహామీల మధ్య ఆ తర్వాత హైదరాబాదులో గౌతమీ వుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభమైంది.

 

యుద్ధం సీన్ల కోసం ఇలా...

 

మొదటి షెడ్యూల్ మోరాకోలోని అట్లాస్ స్టూడియోలో, వారు జార్జెస్‌ల్లో జరిగింది. యుద్ధం సీన్లను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో వేయి మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. 200 గుర్రాలు, ఒంటెలను ఈ సీస్ల చీత్రికరణ వాడారు. ప్రతి రోజూ 14 నుంచి 16 గంటలు పనిచేసి 14 రోజుల్లో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.

 

చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద

 

రెండో షెడ్యూల్ హైదరాబాదు సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద జరిగింది. ఈ షెడ్యూల్ మే 30వ తేదీన ప్రారంభమైంది. యుద్ధం దృశ్యాలను వినూత్న రీతిలో ఇక్కడ చిత్రీకరించారు. పెద్ద యెత్తున పడవలను, ఓడలతో షెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాకు సంబంధించి ఇదే పెద్ద షెట్టింగ్.

 

క్లైమాక్స్ వార్ సీన్స్ కోసం..

 

మూడో షెడ్యూల్ జులై 4వ తేదీన జార్జియాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో మైండ్ బ్లోయింగ్ వార్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు. శాతవాహనుల సైన్యం, గ్రీకు సైన్యంతో తలపడే యుద్ధ సన్నివేశాలను జార్జియాలోని మౌంట్ కెజ్‌బెగ్ లోకేషన్స్‌లో చిత్రీకరించారు. ఇది రష్యా సరిహద్దలకు సమీపంలో ఉంటుంది. వేయి మంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. 300 గుర్రాలను, 20 రథాలను వాడారు.

 

నాలుగో షెడ్యూల్....

 

నాలుగో షెడ్యూల్ మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 29వ తేదీన ప్రారంభమైంది. అది సెప్టెంబర్ 20వరకు సాగింది. చక్రవరి శాతవాహన సాగాను రాజసూయ యాగం దృశ్యాలను చిత్రీకరించారు. ముఖ్యమైన సీన్లను కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత శివరాజ్ కుమార్ ఎంట్రీ వంటి ప్యాచప్ వర్కులు పూర్తి చేశారు.

 

వాటికి. అద్బుతమైన రెస్పాన్

 

గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, ప్రమోషనల్ టీజర్‌కకు అద్భుతమైన రెస్పాన్స్ లభించినట్లు నిర్మాతలు చెప్పారు. మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయని అన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఓ పాటను రికార్డు చేశారు.

 

ఈ సినిమా నిర్మాణం యాంత్రికమైంది కాదు..

 

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నిర్మాణం అతి సాధారణమైన యాంత్రికమైన ప్రయాణం కాదని, తమకు ఎన్నో మరిచిపోలేని జ్జాపకాలను ఇది మిగిలించిందని, ఈ జ్ఞాపకాలు తమకు జీవితాంతం గుర్తుండిపోతాయని నిర్మాతలు అన్నారు.

 

బాలకృష్ణ పిల్లర్‌లా నిలబడ్డారు.

 

బాలకృష్ణ నిబద్ధతను చెప్పడానికి మాటలు సరిపోవని నిర్మాతలు అన్నారు. ప్రతి సందర్భంలోనూ స్ఫూర్తిని అందిస్తూ తమ జట్టుకు పిల్లర్‌లా నించున్నారని చెప్పారు. ఈ విధమై మహా నటుడి కాదు, సాధారణమైన మానవుడితో పనిచేయడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ నిబద్ధత, మద్దతు వల్లనే తాము సినిమాను పూర్తి చేయగలిగామని, ఆయన జట్టుకు అందించిన స్ఫూర్తి మరువలేనదని చెప్పారు.

 

బాలకృష్ణ ఫ్యాన్ బేస్, సినీ ప్రేక్షకులు..

 

బాలకృష్ణకు గల ఫ్యాన్ బేస్, సినిమా లవింగ్ ఆడియన్స్ వల్లనే గౌతమీ పుత్ర శాతకర్ణి నిర్మాణం సాధ్యమైందని నిర్మాతలు అన్నారు. పూర్తి స్థాయిలో పనిచేయడానికి, తమ శక్తియుక్తులను పెట్టడానికి కృష్‌కు, బాలయ్యకు ఉన్న ఉద్వేగభరితమైన నిజమైన ప్రోత్సాహం వల్లనే అది సాధ్యమైందని చెప్పారు.

 

జనవరి రెండోవారంలో...

 

తాము ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను జనవరి రెండో వారంలో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటింటారు. గత 79 రోజులుగా ఈ సినిమా నిర్మాణం జరుగుతూ వచ్చిందని చెప్పారు. అత్యద్భుతమైన దృశ్య కావ్యాన్ని ప్రేక్షకులకు అందించగలమనే నమ్మకం తమకు ఉన్నట్లు వారు తెలిపారు.

 

 

English summary
Natasimha Nandamuri Balakrishna’s historical 100th film Gautamiputra Satakarni is directed by National Award winning Jagarlamuldi Krish and produced by Y Rajeev Reddy, Jagarlamudi Saibabu on First Frame Entertainments banner. The prestigious project completed entire shooting part yesterday evening and producers are delighted to announce the breaking of pumpkin.
Please Wait while comments are loading...