twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని ఉద్దేశించి కాదు, కులాల ప్రస్తావన వద్దు, చిరాకేస్తోంది: క్రిష్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి, బాలయ్య నటించిన రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమైనప్పుడే వాతావరణం వేడెక్కింది. దీనికి తోడు ఆ మధ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్ 'కబడ్దార్' అంటూ వఖ్యానించడం వివాదానికి దారి తీసింది.

    క్రిష్ 'కబడ్దార్' అనే పదం చిరంజీవి సినిమాను ఉద్దేశించే వాడారంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఈ అంశాన్ని బేస్ చేసుకుని కొందరు క్రిష్ ను సోషల్ మీడియాలో తిట్టిపోస్తుండటం... చిలికి చిలికి ఇది ఒక అగ్లీ వార్‌గా మారిన నేపథ్యంలో క్రిష్ స్పందించారు.

    తన గురువైన తమ్మారెడ్డి భరద్వాజతో ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రిష్... ఈ వివాదంపై స్పందించారు.

     చిరంజీవిని ఉద్దేశించి కాదు

    చిరంజీవిని ఉద్దేశించి కాదు

    నేను ఖబడ్దార్ అన్న పదాన్ని చిరంజీవిని ఉద్దేశించి అనలేదు. నేను చిరంజీవి గారికి చాలా క్లోజ్. చరణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అల్లు అర్జున్ నన్ను నమ్మి డబ్బులు పెట్టి వేదం సినిమా చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి గారిని కూడా ఆహ్వానించాం. సినిమా విజయం సాధిస్తుందని ఆయన నన్ను అభినందించారు. నేను ఆయన్ను అనేంత కుసంస్కారిని కాదు, ఆ స్థాయి నాది కాదు అంటూ క్రిష్ వివరణ ఇచ్చుకున్నారు.

     భయమేసి నాగబాబు గారికి ఫోన్ చేసాను

    భయమేసి నాగబాబు గారికి ఫోన్ చేసాను

    ‘కబడ్దార్' ఇష్యూపై విషయంలో ట్విట్టర్‌లో జరుగుతున్న రచ్చ చూసి....నాకు కాస్త భయం వేసింది. వెంటనే నాగబాబు గారికి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. రాఘవేంద్రరావు అంకుల్‌కు పరిస్థితిని వివరించాను అని క్రిష్ తెలిపారు.

     ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తోంది

    ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తోంది

    గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 సినిమాలపై కామెంట్లు చేస్తున్నారంటే.. ఆకాశంవైపు చూసి ఉమ్మేసినట్టే. అది పోయి..పోయి మళ్లీ వారి మీదే పడుతుంది. ట్విట్టర్ ఓపెన్ చేద్దామంటేనే సిగ్గేస్తోంది. చిరాకేస్తోంది అని క్రిష్ అన్నారు.

     బహుపరాగ్ అనబోయే కబర్దార్ అన్నాను

    బహుపరాగ్ అనబోయే కబర్దార్ అన్నాను

    ఇంతవరకు ఎవరూ మాట్లాడుకోని చరిత్ర గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పటికీ ఉత్తరాదిన మనల్ని మద్రాసీలు అంటారు. ఈ సినిమా వల్ల మనకు ఓ గుర్తింపు వస్తుంది. ఆ ఉత్సుకతతోనే ‘బహుపరాక్' అనబోయి ‘ఖబడ్దార్' అని అన్నాను. అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అని క్రిష్ తెలిపారు.

    కులాల ప్రస్తావన వద్దు

    శాతకర్ణి, ఖైదీల మధ్య పోటీ లేదని, కులాల ప్రస్తావన దయచేసి తేవద్దని క్రిష్ అభిప్రాయ పడ్డారు. కంచె వంటి సినిమాను తీసిన తనకు కులం అంటే లెక్క లేదని వివరించాడు. రెండు సినిమాలు భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

    English summary
    Check Out Gautamiputra Satakarni Director Krish & Tammareddy Bharadwaj Face to Face Interview. In this Video Krish talks about our Tollywood Stars like Allu Arjun, Ram Charan & Balakrishna. He also cleared all the confusions by explaining the statement and situation on "Khabardar" dialogue Controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X