» 

ఆ హీరోయిన్ పై జెనీలియా కౌంటర్లు

Posted by:
Give your rating:

ఇప్పుడు జెనిలియాకు,అసిన్ కి మధ్య కోల్డ్ వార్ స్టార్టయ్యైంది.దానికి కారణం జెనిలియా తాజా చిత్రం 'ఫోర్స్".తెలుగులో ఘర్షణగా గా వెంకటేష్ తో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో జాన్ అబ్రహమ్,జెనిలియా కాంబినేషన్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అందులోని సూపర్ హిట్ సాంగ్ 'చెలియ చెలియ..."ని షూట్ చేసారు. సెప్టెంబర్ 30న 'ఫోర్స్" విడుదల చేయనున్న సందర్భంగా జాన్‌అబ్రహం, జెన్నీపై చిత్రీకరించిన ఈ పాటను ఇటీవలే మీడియాకు విడుదల చేశారు.జెనిలీయుకు ఇబ్బందులు అప్పట్నుంచే మొదలయ్యాయి. 'చెలియ చెలియ" పాటలో అసిన్ ఎంత హుందాగా నటించిందో, జెన్నీ అంత అసహ్యంగా చేసిందని కామెంట్స్ అంతటా చోటు చేసుకున్నాయి.

సరే ఇవన్నీ కామనే అనుకుంటే ఈ లోగా అసిన్ ఓ కామెంట్ చేసి జెనీలియాను విమర్శించింది. ఈ పాట గురించి అసిన్ మాట్లాడుతూ- చాలా హృద్యంగా ఉంటుందీ పాట. నేనెంతో ఫీలై నటించిన పాట అది. దాన్ని జెనీలియా ఖూనీ చేసింది"" అని బాహాటంగా ప్రకటించేసింది. దాంతో ఎక్కడో కాలిన జెనిలియా వెంటనే...'కాక్కా కాక్క"లో జ్యోతిక ఆ పాటను అద్భుతంగా చేసింది. జ్యోతికలో కనిపించినంత క్యూట్‌నెస్ అసిన్‌లో కనిపించదు. తెలుగులో అసిన్ చాలా ఓవరాక్షన్ చేసేసింది. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా నా స్టైల్‌లో నేను చేశాను. ఒకర్ని చూసి చేయాల్సిన ఖర్మ నాకింకా పట్టలేదు అని కౌంటర్ ఇచ్చింది.మరి కౌంటర్ల యుద్దం ఇక్కడితో ఆగుతుందా మరింత ముందుకు వెళ్ళుతుందో చూడాలి.

Read more about: asin, genelia, gharshana, అసిన్, జెనిలియా, ఘర్షణ
English summary
Earlier there were reports about Genelia D’Souza commenting on Asin and members of the film fraternity seem to be thinking on the lines of whether this taunting and lashing out on each other thereby trying to affect one and another's ego is ever going to come to a stop.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive