twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక బాహుబలి మనది కాదు.. హిందీలోనే :రాజమౌళి దర్శకత్వం అనుమానమే

    'బాహుబలి' టీవీ సిరీస్ తెలుగులో కాకుండా హిందీలో తెరకెక్కుతుందంటూ ట్విస్టు ఇచ్చాడు నిర్మాత శోభు యార్లగడ్డ.

    |

    'బాహుబలి-2' విడుదలకు ముందే చిత్ర నిర్మాతలు, దర్శకుడు రాజమౌళి త్వరలోనే బాహుబలిని టీవీ సిరీస్ గా రూపొందిస్తామని అన్నారు. ప్రస్తుతం బాహుబలి ఘన విజయం సాధించడంతో ఈ టీవీ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి.. అయితే ఇప్పుడు బాహుబలి మనది కాదు.. హిందీ వాళ్ళది మన బాహుబలిని మనమే డబ్ చేసుకొని చూడాల్సి వస్తోంది...

     'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో

    'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో

    ఆ సిరీస్ రూప కల్పనకు చేయాల్సిన పనులను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే మొదలై విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఐతే వీటిలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది టీవీ సిరీసే. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో బాహుబలి టీవీ సిరీస్ ను కూడా ఇండియాలో ఒక బ్రాండ్ గా మార్చాలని.. ప్రేక్షకుల్ని అలరించాలని బాహుబలి టీం భావిస్తోంది.

    చాలానే ప్లాన్స్ చేస్తున్నారు

    చాలానే ప్లాన్స్ చేస్తున్నారు

    ఒక చిత్రంగా బాహుబలికి ఎండ్ కార్డ్ పడిందేమో గానీ దాని హవా మాత్రం కొనసాగుతూనే ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. బాహుబలి పాత్రలతో పుస్తకాలు, కామిక్స్, గేమ్స్, వీడియోలు, టీవీ సిరీస్, వెబ్ సిరీస్ ఇలా బాహుబలి ప్రస్థానాన్ని కొనసాగించడానికి చాలానే ప్లాన్స్ చేస్తున్నారు. అయితే వీటన్నింటిలో ఆసక్తిని కలిగిస్తోంది మాత్రం టీవీ సిరీస్. బాహుబలి సినిమాను ఆధారంగా చేసుకొని ఈ టీవీ సిరీస్ ఉండబోతుంది.

    తెలుగులో తీయరట

    తెలుగులో తీయరట

    ఐతే 'బాహుబలి' సినిమా తరహాలో దీన్ని బేసిగ్గా తెలుగులో తీయరట. 'బాహుబలి' టీవీ సిరీస్ హిందీలో తెరకెక్కుతుందంటూ ట్విస్టు ఇచ్చాడు నిర్మాత శోభు యార్లగడ్డ. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అవుతోందని.. త్వరలోనే టీవీ సిరీస్ చిత్రీకరణ మొదలవుతుందని ఆయన చెప్పారు.

    ముందు హిందీలో

    ముందు హిందీలో

    'బాహుబలి' ఇండియన్ సినిమాగా మారిందని.. దేశం నలుమూలలా దీనికి అభిమానులు ఏర్పడ్డారని.. కాబట్టి ఎక్కువమందికి రీచ్ అయ్యేందుకు ముందు హిందీలో తీసి.. తర్వాత తెలుగు సహా మిగతా భాషల్లోకి డబ్ చేస్తామని ఆయన అన్నారు. హిందీలో తీసి.. తెలుగులోకి డబ్ చేస్తే కచ్చితంగా అది 'ఒరిజినల్' ఫీలింగ్ ఇవ్వదు.

    ఎవరు డైరెక్ట్ చేస్తారు?

    ఎవరు డైరెక్ట్ చేస్తారు?

    ఇలా అనువాదం చేసిన టీవీ సిరీస్ ఎపిసోడ్లను మనవాళ్లు ఎంతమాత్రం రిసీవ్ చేసుకుంటారో మరి. బాహుబలిని హిందీ వాళ్లు ఎంత ఓన్ చేసుకున్నప్పటికీ టీవీ సిరీస్ ను నేరుగా హిందీలో మొదలుపెట్టాలనుకోవడం తెలుగు ప్రేక్షకులకు రుచించని విషయమే. మరి తన ‘బాహుబలి ప్రయాణం ముగిసిందని రాజమౌళి ప్రకటించేసిన నేపథ్యంలో టీవీ సిరీస్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఎలా తీర్చిదిద్దుతారన్నది ఇప్పుడు మరింత ఆసక్తి కరమైన ప్రశ్న...

    జనం ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారు

    జనం ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారు

    ఈ టీవీ సిరీస్కి దర్శకత్వం రాజమౌళి చేయకపోవచ్చనే వార్తలే వినిపిస్తున్నాయి. అందులోనూ ఇప్పటికే శివగామి, బాహుబలి, కట్టప్ప పాత్రల్లో రమ్య కృష్ణ, సత్యరాజ్, రానా, ప్రభాస్ ఇలా అందరూ ముద్ర పడిపోయారు. మరి ఈ టీవీ సిరీస్ లో కొత్త నటులను జనం ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారన్నదీ అనుమానమే.

    10 నుండి 13 ఎపిసోడ్ల వరకు

    10 నుండి 13 ఎపిసోడ్ల వరకు

    ఇకపోతే ఈ సిరీస్ 10 నుండి 13 ఎపిసోడ్ల వరకు ఉండనుంది.ఒకేసారి ఓ పది పదిహేను ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేసి, అవి పూర్తయ్యే లోపు ఆ కథను ఫినిష్ చేసేస్తారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ అవే క్యారెక్టర్లను చూపిస్తూ ఫ్రెష్ స్టోరీతో వస్తారు.

    ఆనంద్‌ నీలకంఠన్‌

    ఆనంద్‌ నీలకంఠన్‌

    బాహబలి రాజ మాత శివగామికి సంబంధించిన కథను మూడు భాగాలుగా ఆనంద్‌ నీలకంఠన్‌ అనే రచయిత రాశారు. అందులో మొదటి పుస్తకాన్ని రాజమౌళి ఆవిష్కరించారు. ఈ కథలో శివగామి మాహిష్మతి రాజ్యానికి రాణి. కట్టప్ప అనే మరో అద్భుతమైన పాత్ర కూడా ఈ కథలోనే పరిచయమవుతుంది.

    కథలో లేని 40 కొత్త పాత్రలతో

    కథలో లేని 40 కొత్త పాత్రలతో

    శివగామి పాత్రలో ఒక రాజమాతతోపాటు ఒక గొప్ప యోధురాలు కన్పిస్తుందట.మాహిష్మతి సామ్రాజ్ఞిగా శివగామిగా ఎదిగిన ఆమె జీవితంలో ‘బాహుబలి' సినిమా కథలో లేని 40 కొత్త పాత్రలను ఈ టీవీ సిరీస్ లో చూపించబోతున్నారు. ఎంత గొప్పగా తీసిన మనది కాదు అన్న ఫీలింగ్ మాత్రం మనసులో ఉంటూనే ఉంటుంది కదా

    English summary
    producer Shobu confirmed to Bollywood Hungama that the TV series will be made in Hindi. “Baahubali doesn’t belong to Andhra Pradesh anymore. It’s gone out to the world. We’ve decided to make the television series in Hindi, and then telecast it in different Indian languages. Why Hindi? Because it’s the national language and has maximum reach.” said Shobu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X