»   » తప్పు మాదే: యాంకర్ రేష్మి-సుధీర్ ఎఫైర్, నిజం బయట పెట్టిన గెటప్ శ్రీను!

తప్పు మాదే: యాంకర్ రేష్మి-సుధీర్ ఎఫైర్, నిజం బయట పెట్టిన గెటప్ శ్రీను!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ రష్మిగౌతమ్, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం జబర్దస్త్ స్కిట్లు చేసేప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ఇద్దరిపై సెటైర్లు వేయడం ఓ కారణం అయితే, రేష్మి, సుధీర్ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం లాంటివి చూసిన వారెవ్వరికైనా ఈ అనుమానం రాక తప్పదు.

జబర్దస్త్ కామెడీ షోలో సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ కొంతకాలంగా రకరకాల ప్రచారం జరుగుతోంది.

అయితే ఇవన్నీ ఇప్పటి వరకు కేవలం గాసిప్స్ గానే ఉండిపోయాయి... నిజా నిజాలు ఏమిటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్న గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఈ విషయమై అభిమానుల నుండి ఈ విషయమై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

రేష్మి, సుధీర్ లవర్స్ అని, ఎఫైర్ ఉందని అంటున్నారు... నిజమేనా? అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

రేష్మి, సుధీర్

రేష్మి, సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగడానికి మూల కారణం మేమే అని గెటప్ శ్రీను వెల్లడించారు.

ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి..

ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి, స్కిట్ లో పంచ్ లు పేలడానికి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సరదాగా కామెంట్స్ చేసే వారమని తెలిపారు.

ఎఫైర్ లేదు

రేష్మి, సుధీర్ కేవలం స్నేహితులు మాత్రమే, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని గెటప్ శ్రీను తెలిపారు.

తప్పు మాదే..

ఇలాంటి ప్రచారం జరుగడానికి కారణం జబర్దస్త్ టీం సభ్యులే, తప్పు మాదే అనే విధంగా గెటప్ శ్రీను సమాధానం ఇచ్చారు.

సుధీర్ స్పందిస్తూ..

షూటింగ్ సెట్లో తప్ప బయట మేము మాట్లాడుకోసం... నాలుగేళ్లలో ఒకటి రెండు సార్లు హాయ్ అనే మెసేజ్ తప్ప తమ మధ్య ఎలాంటి సందేశాలు లేవని సుధీర్ తెలిపారు.

రూమర్స్ కు తెర దించాలనే

ఈ రూమర్స్ వల్ల రేష్మితో పాటు, సుధీర్ కూడా ఇబ్బంది పడ్డాడు. ఈ రూమర్స్ తెరదించాలనే ఈ లైవ్ చాట్లో నిర్ణయించుకున్నట్లు గెటప్ శ్రీను తెలిపారు.

ఫేక్ అకౌంట్స్

తన పేరుతో ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయని, అలాంటి వాటిని నమ్మవద్దని, తన పేరుతో అఫీషియల్ పేజీ మాత్రమే ఉందని సుధీర్ తెలిపారు.

అమ్మాయి గురించి బ్యాడ్ గా..

కొందరు తన పేరు, ఫోటోస్ వాడుతూ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయిల గురించి బ్యాడ్ గా కమెంట్స్ చేస్తున్నారని, వాటితో తనకు సంబంధం లేదని సుధీర్ తెలిపారు.

జబర్దస్త్ కి రాకపోయి ఉంటే..

ఓ అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. జబర్దస్త్ కి రాక పోయి ఉంటే హోటల్ పెట్టుకునే వాడిని అని గెటప్ శ్రీను తెలిపారు. తనకు మ్యాజిక్ బాగా వచ్చని, ఇటు రాక పోయి ఉంటే మ్యాజిక్ షోలు చేసుకునే వాడిని అని సుధీర్ తెలిపారు.

వీడియో

సుధీర్, గెటప్ శీను లైవ్ చాట్ కు సంబంధించిన వీడియో

యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

యమున ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి

English summary
Getup Seenu gives clarity on Rashmi-Sudheer Affair in Facebook Live chat. Check out video.
Please Wait while comments are loading...